జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తొలగింపు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుబాలను ఆ పదవి నుంచి తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఆదివారం జీఓను విడుదల చేసింది. అయితే ఆ స్థానంలో ఎవరిని నియమించారో జీఓలో పేర్కొనలేదు. ఇది నామినేటెడ్ పోస్టు కావడంతో ఆమెను ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజల కవి యోగి వేమన
– కలెక్టరేట్‌లో వేమన జయంతి వేడుకలు
చిత్తూరు కలెక్టరేట్ : వేమన ప్రజల కవి అని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు కొనియాడారు. కలెక్టరేట్‌లో ఆదివారం వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సమకాలీన వ్యవస్థలపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన గొప్ప సంఘ సంస్కర్త వేమన అని వివరించారు. ఆయన రాసిన పద్యాలను ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు నేర్పించి వాటి భావాన్ని తెలియజేయాలని కోరారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పిన ప్రజాకవి వేమన అని చెప్పారు. ఆటవెలదిలో సరళమైన రీతిలో హృదయాలకు హత్తుకునేలా పద్య రచన చేశారని వివరించారు. ఆయన పద్యాలను ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటీలోనూ అనువదించారని తెలిపారు. కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment