జీసీజీటీఏ జిల్లా అధ్యక్షునిగా నరేంద్రకుమార్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం (జీసీజీటీఏ) జిల్లా అధ్యక్షునిగా ఏ.ఎం.నరేంద్రకుమార్ (సావిత్రమ్మ డిగ్రీ కళాశాల) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో ఆ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించింది. రిటర్నింగ్ అధికారి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో జిల్లా కార్యదర్శిగా భాస్కరరాజు (నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల), కోశాధికారిగా అరుణకుమారి (నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల), జిల్లా ఉపాధ్యక్షునిగా నందీశ్వరయ్య (పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికై నట్లు వెల్లడించారు. ఎన్నికై న నూతన కమిటీ సభ్యులను జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.
కానిస్టేబుల్ అప్పీల్ వాయిదా
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణ మైదానంలో సోమవారం జరగాల్సిన కానిస్టేబుల్ అభ్యర్థుల అప్పీల్ కార్యక్రమం వాయిదా పడినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా పడ్డ ఈ కార్యక్రమం ఈనెల 22న ఉంటుందన్నారు. అప్పీల్ చేయాల్సిన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన పేర్కొన్నారు.
పీఆర్‌టీయూ
జిల్లా అధ్యక్షులుగా కణ్ణన్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ (పీఆర్‌టీయూ) అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా డా.కేఎస్ కణ్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆ సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకాచారి, జీవీ రమణ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.
నూతన కమిటీ
పీఆర్‌టీయూ నూతన కమిటీలో డా.కేఎస్.కణ్ణన్ (జిల్లా అధ్యక్షులు), విజయభాస్కర్‌రెడ్డి (జిల్లా ప్రధాన కార్యదర్శి), నరసింహారెడ్డి (జిల్లా వర్కింగ్ అధ్యక్షులు), మోహన్‌రెడ్డి (జిల్లా అసోసియేట్ అధ్యక్షులు), ప్రకాష్‌రెడ్డి (జిల్లా గౌరవ అధ్యక్షులు) నియమితులైనట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment