గుర్తింపు లేకుండా చేశారు
కూటమి ప్రభుత్వం సర్పంచ్‌లకు గుర్తింపు లేకుండా చేసేసింది. ఇటీవల మండలంలో ఉపాధి హామీ పథకంలో పను లను చేపట్టారు. ఆ పనులను సర్పంచ్ అంగీకారం లేకుండానే చేపట్టారు. అవసరం లేని ప్రాంతంలో సీసీ రోడ్లు వద్దని చెబుతున్నా టీడీపీ నాయకుడు రూ.5 లక్షలతో రోడ్లు వేశారు. దౌర్జన్యంగా గ్రామస్తులతో సంతకాలు తీసుకున్నారు. అధికారులు వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
– సరళ, సర్పంచ్,
కేఎల్‌పురం, కార్వేటినగరం మండలం
సర్పంచ్‌లకు ప్రాధాన్యం లేదు
ఈ ప్రభుత్వం వచ్చాక సర్పంచ్‌లకు ఎందులో నూ ప్రాధాన్యం కల్పించడం లేదు. ఇలాంటి ధోరణి గతంలో ఎన్నడూ లేదు. సర్పంచ్‌లను కాద ని బయటి వ్యక్తులు పనులు చేయడం అవమానించినట్టే. ఎన్నికలకు ముందు సర్పంచ్‌లకు ప్రాధాన్యమిస్తామని ఏమేమో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సర్పంచ్‌ల పట్ల వివక్ష చూపుతున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికై నా ఈ ధోరణి మార్చుకోవాలి.
– అనితకుమారి,
సర్పంచ్, జోగివారిపల్లి, సదుం మండలం
వెండర్లతో పనులా?
ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌లను కాదని వెండర్ల చేత పనులు చేయించి వారి ఖాతాల్లో నిధులు జమచేయడం వింతగా ఉంది. ఈ ప్రభు త్వం సర్పంచ్‌లను అవమానిస్తోంది. ఇటీవల నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో సర్పంచ్‌ల అనుమతి లేకుండానే రిజల్యూషన్ రాసుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
– రజనీకాంత్, సర్పంచ్,
వసంతాపురం, గుడిపాల మండలం
గౌరవం దక్కడం లేదు
సర్పంచ్‌లకు కనీస గౌరవం కూడా దక్కడం లేదు. పల్లె పండుగ కార్యక్రమంలో పంచాయతీల్లోని మూడు ప్రాంతా ల్లో రూ.11.20 లక్షలతో రోడ్లు వేయాలని నిర్ణయించారు. ఆ పనులు ఎవరు చేస్తున్నారో కూడా మాకు తెలియదు. పంచాయతీలో అభివృద్ధి పనులు ఆగకూడదన్న ఉద్దేశంతో అడ్డుకోవడం లేదు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. సర్పంచ్‌లకు గౌరవం ఇవ్వాలి.
– విద్య, సర్పంచ్,
కలియంబాకం, నగరి మండలం
Comments
Please login to add a commentAdd a comment