అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
సదుం: అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోరారు. మండలంలోని రామాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. తన అపార మేథో సంపత్తితో రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని ఎంపీ చెప్పారు. ఆయన విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా భావితరాలకు వారి సేవలు తెలియడంతో పాటు స్ఫూర్తిని ఇస్తాయని చెప్పారు.
దళితుల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ కృషి
దళితుల అభివృద్ధికి వైఎస్సార్ సీపీ ఎంతగానో కృషి చేసిందని మాజీ ఎంపీ రెడ్డెప్ప చెప్పారు. తాను గతంలో ఎంపీ అభ్యర్థిగా నిలబడి గెలవడానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోడ్పాటు ఎంతో ఉందన్నారు. వారి కుటుంబం దళితుల అభివృద్ధికి ఎళ్లవేళలా సహకరిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి మాజీ సభ్యుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఎంపీపీ ధనుంజయ రెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జున, సర్పంచ్ వెంకటరమణ, దళిత సంఘం నాయకులు రాజన్న, రామ య్య, రామచంద్రయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంగ్లిషు మీడియం రద్దు నష్టం
పాఠశాల విద్యలో ఇంగ్లిష్ మీడియం రద్దుకు కూటమి సర్కారు చేస్తున్న ప్రయత్నాలతో భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం చేకూరుతుందని మిథున్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మాతృభాషతో సమానంగా ఇంగ్లీషు ఎంతో అవసరమన్నారు. ఇందులో ప్రావీణ్యం ఉంటేనే రాణించగలరని స్పష్టం చేశారు. 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం వైపు మొగ్గు చూపినా సర్కారు మాత్రం దాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. దీన్ని విద్యావేత్తలు, మేధావులు వ్యతిరేకించాలని కోరారు. దీనిపై పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తామని చెప్పారు. రామాపురంలో కమ్యూనిటీ భవనం, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలని సమావేశంలో గ్రామస్తులు కోరగా, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ఎంపీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment