ఇదో సెమిస్టరీ
పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎంతో ఘనత ఉంది. ఆ కళాశాలకు ఉన్న ఘనతను పరిగణనలోకి తీసుకుని పీవీకేఎన్‌కు నాక్ –ఏ గ్రేడ్‌తోపాటు అటానమస్ హోదాను కల్పించారు. అయితే ఆ కళాశాలలో ప్రస్తుతం జరుగుతున్న వింత ధోరణి విమర్శలకు తావిస్తోంది. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత కొద్ది రోజులుగా మూడవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రెండు సబ్జెక్టులకు సంబంధించి ముందస్తుగా విద్యార్థులకు ఇచ్చిన బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) మోడల్ పేపర్‌ను యథావిధిగా సెమిస్టర్ పరీక్షల్లో ఇచ్చారు. పేరొందిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ తతంగం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పేరొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీవీకేఎన్. అలాంటి ఘనత ఉన్న ఈ కళాశాలలో పాలన గాడి తప్పింది. ఫలితంగా పరీక్షల నిర్వహణ మిస్టరీగా మారింది. జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పలమనేరు, జీడీనెల్లూరు పలు ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులు ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. పీవీకేఎన్ కళాశాలలో తమ పిల్లలను చదివిస్తే ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని తల్లిదండ్రులకు బలమైన నమ్మకం. అయితే అక్కడ జరుగుతున్న తతంగం చూస్తే కళాశాల కీర్తి ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది.
● మోడల్ పేపర్‌నే సెమిస్టర్ ప్రశ్నపత్రంగా ఇచ్చిన వైనం
● పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలలో వింత ధోరణి
● అటానమస్ నిబంధనలుపాటించని యంత్రాంగం
● ఇప్పటికి జరిగిన వాటిలో రెండు పరీక్షలు ఇలానే
● కళాశాల నిర్వహణ, పాలనా దుస్థితిపై అనుమానాలు
Comments
Please login to add a commentAdd a comment