విద్యుత్ అంతరాయాలు తగ్గించాలి
● అధికారులకు ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశం
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ అంతరాయాలు తగ్గించేందుకు క్షేత్ర స్థాయిలో సిబ్బంది కృషి చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ ఆదేశించారు. చిత్తూరు అర్బన్ ఈఈ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. నూతన డివిజన్ పరంగా నగరం, బంగారుపాళ్యం, పైపల్లె, రెడ్డిగుంట సబ్‌డివిజన్లు వస్తాయని పేర్కొన్నారు. సెక్షన్ల వారీగా సిబ్బందిని సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. ప్రతి నెలా వందశాతం వరకు విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురికాకుండా లైన్‌ఇన్‌స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. 200 యూనిట్లపై విద్యుత్ వాడే వినియోగదారులకు పీఎం సూర్యఘర్ సోలార్ విధానం వాడే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి, పొదుపుగా వాడకం వల్ల భవిష్యత్‌లో కొరత రాదన్నారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, డీఈఈలు ప్రసాద్, ఆనంద్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment