చికిత్స అందించడంలో అలసత్వం వద్దు
● జిల్లాస్థాయి ఆస్పత్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి ● ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు ● కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ హెచ్చరిక
చిత్తూరు కలెక్టరేట్ : పేదలకు అందించే చికిత్స విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి ఆస్పత్రిలో నాణ్యతా ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. ఆస్పత్రిలో నిరుపయోగమైన బయో మెడికల్ వ్యర్థాలను తొలగించేందుకు సరైన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. డయాగ్నస్టిక్ సేవలు, ల్యాబొరేటరీ సేవలు, శస్త్రచికిత్స సదుపాయాలు, కాన్పు సేవలకు అవసరమైన సదుపాయాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమీక్షలో డీఎంహెచ్‌ఓ ప్రభావతిదేవి, జిల్లాస్థాయి ఎన్‌క్యూఏఎస్ క్వాలిటీ అధికారి నిరంజన్‌రెడ్డి, జిల్లా క్వాలిటీ మేనేజర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ లక్ష్యాలను సాధించాలి
చిత్తూరు కలెక్టరేట్: నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి రోడ్ల పనులపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకంలో 2024–25 సంవత్సరానికి మంజూరు చేసిన 1500 అంతర్గత సీసీ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే పురోగతిలో ఉన్న 612 పనులను డిసెంబర్ 20లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రారంభించని పనులు త్వరతిగతిన ప్రారంభించాలన్నారు. ఎంపీ ల్యాడ్స్ పనులు పకడ్బందీగా చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment