నేటి నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
● అండర్–14 విభాగంలో 13 జిల్లాల నుంచి పోటీల్లో పాల్గొననున్న బాలబాలికలు ● అరగొండలో క్రీడామైదానాలు ఏర్పాటు ● క్రీడా పోటీలను ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ
తవణంపల్లె: 68వ రాష్ట్రస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ బాలబాలికల టోర్నమెంట్ పోటీలు శుక్రవారం అరగొండ బాలుర హైస్కూల్ క్రీడామైదానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ జె.వసంతవాణి, మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజులు రెడ్డి, సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణ, అరగొండ బాలుర హైస్కూల్ హెచ్‌ఎం భువనేశ్వరి తెలిపారు. ఏపీ పాఠశాల విద్య సౌజన్యంతో జిల్లా విద్యాశాఖ, జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అరగొండ బాలుర హైస్కూల్ క్రీడామైదానం, అరగొండ టోటల్ హెల్త్ క్రీడామైదానంలో అండర్–14 బాల, బాలికలకు సాఫ్ట్‌బాల్ టోర్నీ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు 13 జట్లు, బాలికలు 13 జట్లు పాల్గొంటాయి. క్రీడాకారులతో పాటు కోచ్‌లు, మేనేజర్లు, పీడీలు వచ్చారన్నారు. వీరికి అరగొండ బాలికల హైస్కూల్లో, బాలికలకు మాత్రం వినాయక విద్యామందిర్‌లో వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని శుక్రవారం 10.30 గంటలకు క్రీడాపోటీలను ప్రారంభిస్తారన్నారు. అలాగే డీఈఓ వరలక్ష్మి, డీవైఈఓ చంద్రశేఖర్, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఎంఈఓలు పాల్గొంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment