గుజ్జు పరిశ్రమ నుజ్జు! | - | Sakshi
Sakshi News home page

గుజ్జు పరిశ్రమ నుజ్జు!

Published Sat, Nov 23 2024 12:15 AM | Last Updated on Sat, Nov 23 2024 12:15 AM

గుజ్జు పరిశ్రమ నుజ్జు!

గుజ్జు పరిశ్రమ నుజ్జు!

రుచిలో మధురం.. వేసవి ప్రత్యేకం.. ఫలాల్లో రాజసం.. ఉద్యాన పంటలకే తలమానికం మామిడి. ఆహార ప్రియుల నోరూరించే మాధుర్యం ఉన్న ఈ పండు ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు మాత్రం ఖాయిలా దశకు చేరే స్థితి నెలకొంది. యూరప్‌ దేశాల్లో యుద్ధం కారణంగా మామిడి గుజ్జు ఎగుమతి ఆగిపోయింది. పరిశ్రమల్లో నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా అటు వ్యాపారులు.. ఇటు కర్షకులకు చేదు మిగలనుంది.
● జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ కుదేలు ● గుజ్జు ఎగుమతి..లేక విలవిల ● యూరప్‌ దేశాల్లో యుద్ధం ఎఫెక్ట్‌ ● పేరుకుపోయి .2.75 లక్ష టన్నులు గుజ్జు నిల్వలు

కాణిపాకం: మామిడి గుజ్జు పరిశ్రమలు కుదేలవు తోంది. ఎగుమతి లేక వ్యాపారులు విలవిలలాడుతున్నారు. యూరప్‌ దేశాల్లో యుద్ధం కారణంగా గు జ్జు ఎగుమతికి బ్రేక్‌ పడింది. దీంతో ఉమ్మడి చి త్తూరు జిల్లాలో 2.75 లక్షల టన్నుల గుజ్జు పేరుకుపోయింది. దీనికితోడు వ్యాపారులను జీఎస్టీ వేధిస్తోంది. బ్యాంకు రుణాల గడువు ముంచుకొస్తోంది. అలాగే మామిడి సీజన్‌ సమీపిస్తుండడంతో ఫ్యాక్టరీ యజమానులు అయోమయంలో పడ్డారు. దీని ప్రభావం మామిడిసాగు రైతులపై పడనుంది.

జిల్లా మామిడికి పెట్టిన పేరు

జిల్లా మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లాలోని మామిడి రుచి..నాణ్యత భేష్‌ అన్న మార్క్‌ ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని పంట ఉత్పత్తుల కోసం స్థానిక మామిడి గుజ్జు పరిశ్రమల వ్యాపారులు, మా మిడి వ్యాపారులతోపాటు తమిళనాడు, కర్ణాటకలో ని ఫ్యాక్టరీ యజమానులు సైతం క్యూకడుతుంటా రు. ఈ క్రమంలో మామిడి పంట దిగుబడితోపాటు గుజ్జు తయారీలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. అయి నా మామిడిని నమ్ముకున్న అన్నదాతకు లాభాల మాధుర్యం ఏటా దూరం అవుతోంది.

జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో సాగు

జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగు అవుతోంది. ఇందులో 65 శాతం పంట తోతాపురి రకం ఉంది. ఈ పంటపై సుమారు 80 వేల మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు.

యుద్ధంతో ఎగుమతికి బ్రేక్‌

ఈ ఏడాది తోతాపురి రకం కిలో రూ.30 వరకు పలికింది. బేనిషా, ఇతర రకాల పండ్లను పరిశ్ర మల యజమానులు కిలో రూ.50 పైగా కొనుగోలు చేశారు. ఈ పండ్లను గుజ్జు తీశారు. ఇలా తయారు చేసిన మామిడి గుజ్జును అధికంగా యూరఫ్‌ దేశాలకే ఎగుమతి చేస్తారు. అలాగే కొంత మొత్తంలో గల్ఫ్‌కు కూడా ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం యూర ప్‌ దేశాల్లో యుద్ధం కారణంగా గుజ్జు ఎగుమతి ఆగిపోయింది. మూడు నెలలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 47 పల్ప్‌ ఫ్యాక్టరీల్లో 2.75 లక్షల గుజ్జు ని ల్వ ఉంది. దీని విలువ సుమారు రూ.1,750 కోట్లు ఉంటుందని అంచనా. దీని ప్రభావం రానున్న సీజన్‌పై పడనుంది. ఎగుమతి లేని కారణంగా పలు ఫ్యాక్టరీలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే వచ్చే సీజన్‌కు మామిడి పంట రోడ్డు పాలుకాక తప్పదని పరిశ్రమల యజమానులు, వ్యాపారులు, రైతులు దిగులు చెందుతున్నారు.

ఈ ఏడాది గుజ్జు తయారీ

2.75 లక్షల టన్నులు

పండ్ల గుజ్జు పరిశ్రమలు

47

గుజ్జు ఎగుమతి అయ్యే దేశాలు

గల్ఫ్‌, యూరఫ్‌

నిల్వ ఉన్న గుజ్జు విలువ

1,750 కోట్లు

● ఆరు నెలల పాటు దీర్ఘకాలిక, తాత్కాలిక రుణాలు వర్కింగ్‌ క్యాపిటల్‌ లిమిట్స్‌ వాయిదా వేయాలి. వడ్డీకి రాయితీలిచ్చి ఆదుకోవాలి. జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలి.

● గుజ్జు పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలను వెంటనే విడుదల చేయాలి.

● కరెంట్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలను రద్దు చేయాలి.

● ఇన్‌ ల్యాండ్‌ కంటైనర్‌ డిపో మంజూరు చేయాలి.

● మామిడి గుజ్జు, జ్యూస్‌ ఎమ్మార్పీపై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దాన్ని రద్దు చేయాలి.

● విదేశాల్లో దిగుమతి పన్ను 28 శాతం వసూలు చేస్తున్నారు. వీటిని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి.

● మామిడి బోర్డు ఏర్పాటుతో పాటు ఆ బోర్డును కూడా జిల్లాకు కేటాయించాలి.

పరిశ్రమల యజమానులకు కష్టాల కడలి మొదలైంది. ప్రధానం మామిడి పండ్ల గుజ్జు అమ్ముడు పోతుందా?..లేదా అనే అయోమయంలో పడ్డారు. ఫిబ్రవరి నెలాఖరుకు గుజ్జు ఎగుమతి కాని పక్షంలో ఢీలా పడేలా ఉన్నారు. దీనికి తోడు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలతో ఆర్థిక కష్టాలు మొదలవుతున్నాయంటూ పరిశ్రమ యజమానులు కంటతడి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని పల్ప్‌ ఫ్యాక్టరీల యజమానులు కోరుతున్నారు. వారి డిమాండ్లు ఇలా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement