టమాటరావడం లేదు
పలమనేరు: వారానికిముందు పలమనేరు మార్కెట్‌లో టమాటా ధర బాక్సు రూ.800 పలికింది. ఈ సీజన్‌లో డిసెంబరు ఆఖరు నుంచి కొత్త సంవత్సరంలో టమాటా ధర రూ.1000 దాటుతుందని వ్యాపారులు, రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ వీరి ఆశలు అడియాశలయ్యాయి. ఆ మేరకు సోమవారం స్థానిక టమాటా మార్కెట్‌లో ధర భాక్సు (14కిలోలు) రూ.150 నుంచి వందకు పడిపోయింది. దీంతో ఏమి చేయాలిరా దేవుడా అంటూ రైతులు ఆవేదనకు గురయ్యారు. ధరలు ఎప్పుడెలా ఉంటాయో తెలియక టమాట సాగు లాటరీగా మారింది.
వెయ్యి దాటుతుందనుకుంటే..!
బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు వస్తుండడం, ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటాకు వైరస్ తెగుళ్లు, చలిమంచు, వర్షాల కారణంగా అక్కడి సరుకులో నాణ్యత తగ్గింది. దీంతో ఇక్కడున్న నాణ్యమైన సరుకుకు ధర పెరిగినట్టు మండీవ్యాపారులు భావించారు. ఇక్కడి సరుకు బయటి రాష్ట్రాల్లోనూ మంచి ధరలు పలకడంతో ధరలు పెరిగాయి. పరిస్థితి ఇలాగే ఉంటే కొత్త సంవత్సరానికి బాక్సు ధర రూ.వెయ్యి దాటుతుందని వ్యాపారులు అంచనా వేశారు.
కొంపముంచిన చత్తీస్‌ఘడ్ సరుకు..
చత్తీస్‌ఘడ్, రాయఘడ్ ప్రాంతంలో ఈనెల రెండోవారం నుంచి టమాటా సీజన్ మొదలైంది. దీంతో నాణ్యమైన సరుకు ఎక్కువగా ఈ రెండునెలల పాటు అందుబాటులోకి రానుంది. దీంతో అక్కడి సరుకు భారీగా ఇక్కడి మార్కెట్లకు చేరుతోంది. ఫలితంగా బయటి రాష్ట్రాల వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు రావడం లేదు. దీంతో ధరలు అమాంతం తగ్గినట్టు తెలుస్తోంది.
ధరలు లేక టమాట రైతుల విలవిల పలమనేరులో 14 కేజీల బాక్సు రూ.150 ఉన్నఫళంగా పతనమైన ధరలు చత్తీస్‌ఘడ్‌లో మొదలైన సీజన్ జిల్లాలోని మార్కెట్లకు రాని బయటి వ్యాపారులు
ఉన్నపళంగా టమాట ధరలు పతనం అవడంతో పంట సాగు చేసిన రైతుల నోట మాట రావడం లేదు. కొత్త ఏడాదిలో బాక్సు రూ.1000 పలుకుతుందని భావించిన వారి ఆశలు ఆవిరయ్యాయి. సోమవారం పలమనేరు 14 కేజీల బాక్స్ కేవలం రూ.150 నుంచి రూ.100 పలకడంతో రైతులు ఉసూరమంటూ వెనుదిరిగారు.
పలమనేరు డివిజన్‌లో సాగు వివరాలు
రబీలో టమాటా సాధారణ సాగు
5వేల హెక్టార్లు
ప్రస్తుతం సాగైన పంట
4 వేల హెక్టార్లు
ఇప్పుడు కోతదశలో ఉన్న తోటలు
3 వేల హెక్టార్లు
Comments
Please login to add a commentAdd a comment