తప్పుడు సంతకాలతో అక్రమ మైనింగ్
● మా క్వారీలోకి వెళితే అడ్డుకున్న శేఖర్‌బాబు అనుచరులు ● వారికి చంద్రగిరి ఎమ్మెల్యే సహకారం ● నేను కూడా టీడీపీ వాడినే.. అయినా వదల్లేదు ● నా ప్రాణానికి వారి నుంచి ముప్పు ● గ్రానైట్ వ్యాపారి భానుప్రతాప్
చిత్తూరు రూరల్ : తప్పుడు సంతకాలతో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఎస్‌ఆర్ పురం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు భానుప్రతాప్ ఆరోపించారు. చిత్తూరు గ్రానైట్ క్వారీ సంఘం నాయకుడు శేఖర్ బాబు నుంచి తన ప్రాణానికి ముప్పు ఉందని ఆయన వాపోయారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఆర్‌పురం మండలం దుర్గరాజాపురంలో 1.980 హెక్టార్ల క్వారీ తనకు మంజూరు అయిందన్నారు. మైనింగ్ కార్యాలయంలో ఆఫీస్ పనులు చేసేందుకు శేఖర్ బాబుకు తాను ఇచ్చిన జీపీఏని ఫోర్జరీ చేసి అక్రమంగా మైనింగ్ చేశారని తెలిపారు. ఎటువంటి అనుమతి లేకుండా దాదాపు 1000 బ్లాక్‌ల రాయిని మైనింగ్ చేసి ఎగుమతి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా పక్కనే ఉన్న మరొక క్వారీలో అనుమతి లేకుండా 70 సెంట్లలో దోచేశారన్నారు. రెండు వారాల క్రితం క్వారీలో పనిచేయడానికి వెళ్లిన తనను శేఖర్ బాబు అనుచరులు అడ్డుకున్నారని వాపోయారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదన్నారు. శేఖర్ బాబుకు చంద్రగిరి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, తాను కూడా టీడీపీకి చెందిన వాడినే అయినా తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రస్తుతం క్వారీలో ఉన్న వాహనాలను, యంత్రాలను తొలగించి తనకు క్వారీని అప్పగించి, తాను మైనింగ్ చేసుకునేందుకు భద్రత కల్పించాలని విన్నవించారు.
భానుప్రతాప్‌వి తప్పుడు ఆరోపణలు
దుర్గరాజాపురం క్వారీ వ్యవహారంలో తనపై భానుప్రతాప్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు నిరాధారం అని గ్రానైట్ వ్యాపారి శేఖర్ బాబు స్పష్టం చేశారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment