పాడి ఆవు చోరీ
వి.కోట: పట్టపగలే ఓ రైతుకు చెందిన పాడి ఆవును చోరీ చేసిన సంఘటన మండలంలోని పాముగానిపల్లి పంచాయతీలో వెలుగు చూసింది. రైతు తెలిపిన వివరాల మేరకు.. పాతూరుకు చెందిన రాజగోపాల్ తన పొలంలో పాడి ఆవును చెట్టుకు కట్టేసి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం వెళ్లి చూడగా ఆవు కనిపించలేదు. బైక్‌పై ఆవును వెతుకుతూ రామకుప్పం వైపు వెళ్లగా ఓ ఆటోలో ఆవును తరలిస్తుండడం గమనించాడు. డ్రైవర్‌ను ప్రశ్నించగా ఓ వ్యక్తి ఆటోబాడుగకు రమ్మంటే వచ్చానని బదులిచ్చాడు. అంతలోనే ఆటోలో ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు. గ్రామస్తులు డ్రైవర్‌ను నిలదీయడంతో చోరీ విషయం బయటపడింది. ఆవును రైతు రాజగోపాల్‌కు అప్పగించి, పోలీసులకు సమాచారం అందించగా నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నల్లమందు కొరికి శునకం మృతి
పలమనేరు/గంగవరం: అడవిలో వన్యప్రాణుల వేటకోసం వేటగాళ్లు అమర్చిన నల్లమందు ఉంటను కొరికి ఓ కుక్క మృతి చెందిన ఘటన సోమవారం గంగవరం మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గండ్రాజుపల్లి సమీపంలోని పత్తికొండ రిజర్వు ఫారెస్ట్‌లో వేటగాళ్లు నల్లమందు ఉండలను పగటిపూట పెట్టి మరుసటి రోజు పొద్దున మృతిచెందిన వన్యప్రాణులను తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన ఓ ఊరకుక్క అడవిలో మాంసపు వాసన ఉన్న ఓ నల్లమందు ఉండను నోటితో కరుచుకుని వచ్చి పల్లి శంకరప్ప ఇంటి వద్ద దాన్ని కొరికింది. దీంతో అది భారీ శబ్ధంతో పేలగా, కుక్క ఆ ఇంటి మేడిపై పడి మృతి చెందింది. అటవీశాఖ అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు
చిత్తూరు అర్బన్: పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ రాజు ఆదేశించారు. సోమవారం చిత్తూరులో నగరంలోని జిల్లా ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజల నుంచి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను గుర్తించాలని సూచించారు. పోలీసుశాఖకు సంబంధించి 34 ఫిర్యాదులు అందాయి. అలాగే చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment