ఆరోగ్య పంచాయతీగా బొమ్మసముద్రం
ఐరాల: జాతీయ స్థాయిలో బొమ్మసముద్రం పంచాయతీ ఉత్తమ ఆరోగ్య పంచాయతీ(హెల్తీ పంచాయతీగా) ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు, డీఎల్‌పీఓ పార్వతి తెలిపారు. సోమవారం బొమ్మసముద్రంలో సర్పంచ్ రఘు ఆధ్వర్యంలో వారు అభినంద సభ నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ జాతీయస్థాయికి బొమ్మసముద్రం హెల్తీ పంచాయతీగా ఎంపికై మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం సర్పంచ్ రఘ, ఈఓపీఆర్డీ కుసుమకుమారి, పంచాయతీ కార్యదర్శి మౌనిక, చిగరపల్లె పీహెచ్‌సీ వైద్య సిబ్బంది, పంచాయతీ కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధనలక్ష్మి, చిగరపల్లె వైద్యాధికారి స్వాతి సింధూర, ఎంపీటీసీ విజయకుమారి, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment