ఆర్భాటం సరే..
ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు
ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఏఎస్పీ రాజశేఖర్‌రాజు సూచించారు.
మంగళవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
యాదమరి మండలంలో మరమ్మతులకు నోచుకోని రోడ్డు
మరమ్మతులు చేపట్టకపోవడంతో అధ్వానంగా మారిన పాలసముద్రం మండలం వెంగళరాజకుప్పం రోడ్డు
శుభారాం డిగ్రీ కళాశాలలో నాక్‌బృందం అధ్యయనం
పుంగనూరు: పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఢిల్లీకి చెందిన నాక్ బృంద సభ్యులు పర్యటించి, పలు అంశాలపై అధ్యయనం చేశారు. నాక్ సభ్యులు డాక్టర్ శివాజీమిట్టల్, డాక్టర్ ఆషిమాషాహు, డాక్టర్ మహమ్మద్‌అలీకి ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్, అధ్యాపకులు, పూర్వపు విద్యార్థులు కలసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాక్‌బృందం విద్యార్థులతో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వైఆర్‌సీ, పీఆర్‌సీ, జేకేసీతో పాటు సపోర్టింగ్ యూనిట్లను పరిశీలించారు. అభివృద్ధి కార్యక్రమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చించారు. వీటిపై సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపుతామని నాక్‌బృందం తెలిపింది. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, కోఆర్డినేటర్ అనిల్‌కుమార్, సోమరాజు, ఆంజనేయరెడ్డి, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
శిక్షణా తరగతులకు
ఇది సమయం కాదు
పెద్దపంజాణి: ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎఫ్‌ఎల్‌ఎన్ రీడర్‌షిప్ శిక్షణా తరగతులను తక్షణం రద్దు చేయాలని ఎస్టీయూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షుడు మదన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, ఎస్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో వేసవి సెలవుల్లో శిక్షణా తరగతులను నిర్వహించాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు ఎస్‌ఏ–1 పరీక్షలు జరపాలని, ఇటువంటి సమయంలో శిక్షణా తరగతులు నిర్వహించడం భావ్యం కాదన్నారు. చాలా స్కూళ్లలో ఒకరిద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని, ఒక ఉపాధ్యాయుడు శిక్షణకు వెళ్తే మరొకరు పరీక్షలు ఎలా నిర్వహించాలన్నారు. జిల్లా ప్రధానకార్యదర్శి మోహన్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు సరెండర్ లీవుల బకాయిలు, పెండింగ్‌లోని పీఎఫ్ రుణాలు, ఏపీజీఎల్‌ఐ రుణాల ఫైనల్ పేమెంటును వెంటనే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా 12వ పీఆర్‌సీకి సంబంధించి వెంటనే కమిషనర్‌ను నియమించాలని, మధ్యంతర భృతి (ఐఆర్) 30 శాతం ప్రకటించాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండు చేశా రు. ఎస్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కమిటీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
గుంతలు లేని రోడ్లను నిర్మిస్తామన్న హామీ కూడా గాలికొదిలేసిన పాలకులు
● ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తట్టాబుట్ట చేతబట్టి గుంతలను పూడ్చే కార్యక్రమం అంటూ నేతల హంగామా
● జిల్లావ్యాప్తంగా 1710 కి.మీ మరమ్మతులకు అనుమతులు ● గత ఆరు నెలల్లో పూర్తయింది కేవలం 41 కి.మీ. మేర మాత్రమే
● అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లు కావొస్తున్నా కనిపించని పురోగతి ● ప్రజలు నిలదీస్తారేమో అని మొహం చాటేస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు
● ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల ప్రచార ఆర్భాటం ● మరోమారు కూటమి ప్రభుత్వం మోసం
చిత్తూరు కలెక్టరేట్ : ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తక్షణమే రోడ్ల మరమ్మతులు చేయిస్తాం. ప్రజలు గుంతలు లేని రోడ్లను చూస్తారు. గుంతలు లేని రోడ్లపై ప్రయాణిస్తారు’ అంటూ ఎన్నికల ముందు పెద్ద గొప్పలు పలికారు కూటమి ప్రభుత్వం నేతలు. ఆ గొప్పలు పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను ప్రజలు రోడ్ల మరమ్మతుల అంశాన్ని అడుగుతుంటే మొహం చాటేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో రోడ్లపైకి తట్టలు తీసుకొచ్చి గుంతలు పూడుస్తున్నామంటూ నానా హంగామా చేశారు. ఇప్పుడు ఆ నేతలంతా కానరావడం లేదు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోనే కాదు.. మున్సిపాలిటీల్లోనూ అధ్వాన రోడ్లపై ప్రజలు తీర అవస్థలు ఎదుర్కొంటూ ప్రయాణం చేస్తున్నా పట్టించుకునే కూటమి ప్రజాప్రతినిధే కరువయ్యారు. ఆరు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో మంజూరైన పనులు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే హామీ లు ఎంతవరకు అమలవుతాయనేందుకు నిదర్శనం.
అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా..
జిల్లావ్యాప్తంగా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,710 కిలోమీటర్ల రోడ్లలో మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. దీనికోసం రూ.2193.85 లక్షలు అంచనాతో ప్రణాళిక రూపొందించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడు స్తున్నా ఇప్పటివరకూ 50 కిలోమీటర్లు కూడా రోడ్ల మరమ్మతులు చేయలేకపోయారు. పది ఊళ్లలో రోడ్లలో గుంతలు పూడ్చలేదు. కేవలం రూ.60 లక్ష లు మాత్రమే వ్యయం చేశారు. అందులోనూ పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోనే ఖర్చు పెట్టా రు. మిగిలిన చోట్ల తూతూమంత్రంగా నిధులను ఖర్చు చేశారు. ఇప్పటి వరకు అడుగు గుంత కూడా పూడ్చకపోవడాన్ని క్షేత్రస్థాయిలో గమనించవచ్చు.
రోడ్లు దారుణంగా ఉన్నాయ్..
జిల్లాలో ప్రధాన రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మరింత అధ్వాన స్థితికి చేరాయి. రోడ్లను బాగు చేయిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది. అయితే క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులేమి కనిపించడం లేదు. పాలసముద్రంలోని వెంగళరాజకుప్పానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. కూటమిప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రోడ్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేసి చూపించాలి. – కృష్ణయ్య,
ఆటో డ్రైవర్, పాలసముద్రం మండలం
గుడిపాల రోడ్డులో అంతే సంగతి..
చిత్తూరు నుంచి గుడిపాల మండలం మీదుగా వేలూరుకు నిత్యం ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. ఆ రోడ్డులో వెళ్లాలంటే భయంగా ఉంది. చిత్తూరు నగరంలోని పలు వార్డుల్లో ఉన్న రోడ్ల పరిస్థితి కూడా అంతంతమాత్రమే. గత ప్రభుత్వంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. ఇప్పుడు రోడ్ల మరమ్మతులు చేస్తామన్న కూటమి ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా అలసత్వం చేస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం రోడ్లలో గుంతలను వెంటనే పూడ్చాలి.
– సుజాత, చిత్తూరు నగరం
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
జిల్లా కేంద్రంలో పరిస్థితి మరింత దారుణం
సుమారు 6 లక్షల మందికి పైగా జనాభా ఉన్న చిత్తూరు నగరంలో రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరిట కాలనీల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కరించేవా రు. కొత్త రోడ్లు వేశారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి కలెక్టర్ బంగ్లావరకు ఉన్న రోడ్డులో గుంతలు పూడ్చి మరమ్మతు లు చేపట్టారు. ఆ తర్వాత సంతపేట, హైరోడ్డు, గిరింపేట, కట్టమంచి రోడ్లను మరమ్మతులు చేయడమే మరిచిపోయారు. కొత్తబస్టాండు నుంచి గాంధీబొమ్మ వద్దకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. పైగా గుంతలు ఎక్కువగా ఉండడంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. గుంతలు లేని రోడ్లంటూ ఇంకెన్ని రోజు లు మోసం చేస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు.
జిల్లాలో రోడ్ల మరమ్మతుల పురోగతి ఇలా....
నియోజకవర్గం మరమ్మతులకు ఇప్పటి వరకు
అనుమతులు ఇచ్చిన కి.మీ పూర్తి చేసిన కి.మీ
చిత్తూరు 117.00 కి.మీ 07 కి.మీ
పలమనేరు 224.00 కి.మీ 06 కి.మీ
పుంగనూరు 107.00 కి.మీ 08 కి.మీ
కుప్పం 547.00 కి.మీ 10 కి.మీ
పూతలపట్టు 267.00 కి.మీ 02 కి.మీ
గంగాధరనెల్లూరు 301.00 కి.మీ 06 కి.మీ
నగరి 147.00 కి.మీ 02 కి.మీ
మొత్తం 1710.00 కి.మీ 41 కి.మీ
Comments
Please login to add a commentAdd a comment