లెప్రసీ కేసులను గుర్తించండి
గుడిపాల: గ్రామాల్లో లెప్రసీ కేసులను గుర్తించాలని అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ, లెప్రసీ టీబీ నోడల్ ఆఫీసర్ వెంకటప్రసాద్ అన్నారు. మంగళవారం గుడిపాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించారు. రోజూ నమోదవుతున్న ఓపీల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు వారాలకు మించి పొడి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం లక్షణాలు ఉంటే స్థానికంగా ఉన్న సీఎంసీ ఆస్పత్రిలో ఉచితంగా గల్ల పరీక్ష, ఎక్స్‌రే తీయించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సంధ్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 3 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 67,124 మంది స్వామివారిని దర్శించుకోగా 24,069 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించరని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment