నిందితులను కఠినంగా శిక్షించండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తన సోదరుడు హరికృష్ణ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేసి శిక్షించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నాయకురాలు ఆర్కే శోభారాణి పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన సోదరుడు చిత్తూరులో నివాసం ఉంటున్నారని, ఆయన గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఆ సమయంలో ఆత్మహత్యకు కారకులైన వారి పేర్లను రాసిన సూసైడ్ నోట్‌ను తాను చిత్తూరు డీఎస్పీకి వాట్సాప్‌లో పంపానన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ స్పందించి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె విన్నవించారు.
సారా ఊట ధ్వంసం
చిత్తూరు అర్బన్: యాదమరి మండలం గొందివారిపల్లిలో సారా స్థావరాలపై మంగళవారం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ అధికారులు దాడులు మంగళవారం నిర్వహించారు. దాడుల్లో వెయ్యి లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment