కుప్పం: ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సమావేశాన్ని రాజ్యాంగ విరుద్ధంగా నిర్వహించారని ఎమ్మార్పీఎస్ నాయకుడు దేవరాజు మాదిగ అన్నారు. నిబంధనల ప్రకారం డివిజనల్ స్థాయి అధికారులతో పాటు కమిటీ సభ్యులు తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని, కానీ సోమవారం కుప్పంలో నిర్వహించిన సమావేశాన్ని కోరం లేకుండా అధికార పార్టీకి చెందిన నేతలతో నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళితులు అధికంగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో సమస్యలను అధికారులకు తెలియజేసేందుకు సమావేశంలో సభ్యులకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. కేవలం ఐదుగురు సభ్యులు, ముగ్గురు ప్రభుత్వ అధికారులతో సమావేశాన్ని తూతూమంత్రంగా నిర్వహించారని ఆరోపించారు. ఈ విషయంపై ఆర్డీఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ డివిజనల్ స్థాయి చైర్మన్‌గా ఉన్న తాను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కమిటీలో ఉన్న సభ్యులకు సమాచారం అందించామని, అందరి కోరిక మేరకు సమావేశం నిర్వహించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment