చిత్తూరు కలెక్టరేట్ : షెడ్యూల్ కులాల్లోని ఉప వర్గీకరణ అంశంపై విచారణకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఏకసభ్య కమిషన్‌ను నియమించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉపవర్గీకరణ విచారణకు ఏకీకృత కమిషన్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాను నియమించారన్నారు. సంబంధిత ఏకసభ్య కమిషన్ కార్యాలయం విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో ఉపవర్గీకరణ అంశానికి సంబంధించి ఎవరైనా సంతకంతో మెమొరాండం, వినతులను వ్యక్తిగతంగా, రిజిస్టర్ పోస్టు, మెయిల్ ద్వారా తెలియజేవచ్చన్నారు. జిల్లా ప్రజలు 2025వ సంవత్సరం జనవరి 9వ తేదీ వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. omcrcrub carrificaotn@fmai.com కు గడువు తేదీలోపు వినతులను పంపాలని డీడీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment