అవినీతి బాగోతాలు
సీఎం ఇలాకాలో
● నకిలీ పట్టాలు సృష్టిస్తున్న కోటచెంబగిరికి చెందిన జగదీష్ ● వారం కిందట తహసీల్దార్ ఫిర్యాదుతో విచారించిన పోలీసులు ● విచారణలో బయటపడిన మరో నిందితుడు మురుగేష్ ● ఇద్దరినీ విచారిస్తున్న పోలీసులు ● నిందితులను కాపాడేందుకు రంగంలోకి తెలుగు తమ్ముళ్లు
గుడుపల్లె: నకిలీ పట్టాల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మరో సూత్రధారి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత తీసుకున్న కంచిబందార్లపల్లెకు చెందిన మురుగేష్ బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. గతవారం నకిలీ పట్టాల కేసులో మండలంలోని కోటచెంబగిరికి చెందిన జగదీష్‌ను తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కేసు మరో మలుపు తిరిగింది. మరో సూత్రధారి మురుగేష్ సైతం జగదీష్ తరహాలోనే రాజముద్రలు, స్టాంప్ సీల్‌లు, నకిలీ పట్టాలు, ఒన్‌బీలు అడంగల్‌లు సృష్టించి పేదల నుంచి డబ్బులు వసూలు చేసి సొమ్ము చేసుకున్నాడు. వారం వ్యవధిలోనే ఇద్దరు పట్టుబడడంతో ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారో అని పోలీసు లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నిందితులను కాపాడేందుకు తమ్ముళ్ల యత్నాలు..
నకిలీ పత్రాలు కేసులో పట్టుబడిన ఇద్దరినీ కాపాడేందుకు టీడీపీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నా రు. నిందితుల నుంచి లబ్ధి పొందిన ఆ నాయకులు పార్టీ పెద్దల నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. కేసు తీవ్రత ఎక్కువ కావడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు.
సీఎం ఇలాకాలో అవినీతి బాగోతాలు
సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తు న్న కుప్పంలో రోజుకో అవినీతి బయటపడుతోంది. అవినీతికి అడ్డుకట్ట వేయాలని సీఎం పలు మీటింగుల్లో చెబుతున్నా.. కుప్పంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నకిలీ పట్టా తయారీదారుడు అరెస్టు
కుప్పం: రైతులకు నకిలీ డీ–పట్టాలు ఇచ్చి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన గుడుపల్లె మండలం కోటచెంబగిరి గ్రామానికి చెందిన జగదీష్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ పట్టాల విషయంపై గుడుపల్లె తహసీల్దారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేశామన్నారు. నిందితుడు జగదీష్ కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న ఓ జిరాక్స్ సెంటర్‌లో డీ–ఫారాలను జిరాక్స్ తీసుకున్నట్లు తేలిందన్నారు. ఈ మేరకు జిరాక్స్ సెంటర్‌లో 8 ఖాళీ డీ–పట్టాలు, 2 నకిలీ పట్టాలు ఉండడంతో వాటిని సీజ్ చేసి నిందితుడు జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తహసీల్దారు కార్యాలయం నుంచి డీ–పట్టాలు తీసిస్తామని కొందరు మధ్యవర్తులు రైతులను మోసం చేస్తున్నారని, వారిని నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment