రైతు ద్రోహి చంద్రబాబు
తిరుపతి మంగళం: దేశానికి వెన్నెముక రైతన్న అన్న విషయాన్ని మరిచిన రైతు ద్రోహి చంద్రబాబు అని, గతంలో వ్యవసాయమే దండగా అన్న దుర్మార్గుడు కూడా ఆయనే అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో మంగళవారం ఆయన మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కేవలం అధికార దాహంతో జనసేన, బీజేపీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా అమలు చేయలేదన్నారు. గతంలో అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్‌పై మొదటి సంతకం చేసి తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా కరెంట్ అందించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. అయితే రైతులకు రూ. 20వేలు ఆర్థిక సాయం అందిస్తానని చెప్పిన చంద్రబాబు మరోసారి రైతులను మోసగిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలబడుతుందన్నారు. అందులో భాగంగానే ఈనెల 13వ తేదీన ప్రతి జిల్లాలోని కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించి, ఉద్యమబాట చేపడుతున్నామన్నారు. చిత్తూరు ఉమ్మ డి జిల్లా నుంచి తమ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో తిరుపతి జిల్లాలోని కలెక్టర్‌కు తనతో పాటు అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇస్తారన్నారు. అలాగే అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమ ని అబద్ధపు హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ 6 నెలల్లోనే రూ.15 వేల కోట్లు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇందుకు నిరసనగా ఈ నెల 27వ తేదీన జిల్లాలోని అన్ని డిస్కం ఆఫీసుల వద్ద ధర్నాలు చేసి, వినతిపత్రా లు సమర్పిస్తామని చెప్పారు. అంతకు ముందు ‘రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆర్థిక సాయం ఎక్కడ బాబూ ?
అన్నదాతకు అండగా
వైఎస్సార్‌సీపీ ఉద్యమబాట
ఈనెల 13వ తేదీ జిల్లా కలెక్టర్లకు వినతులు
వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment