నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు చెప్పడం కూటమి ప్రభుత్వంలో అసమ్మతి తారాస్థాయికి చేరిందనడానికి నిదర్శనమని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 76 ఏళ్ల దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఎవరికీ మంత్రి పదవి ఇస్తామని ముందస్తుగా చెప్ప లేదన్నారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన కుమారుడు హరికృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని కూడా చంద్రబాబు ప్రకటించలేదన్నా రు. కానీ ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తా నని చెప్పడం చూస్తే వారి మధ్య ఏ స్థాయిలో విభేదా లు ఉన్నాయో అర్థమవుతుందన్నారు. కేవలం పవన్‌ను బుజ్జగించడానికే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోందన్నారు. నాయకులు బొమ్మగుంట రవి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment