పిచ్చికుక్క స్వైర విహారం | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క స్వైర విహారం

Published Fri, Dec 20 2024 1:47 AM | Last Updated on Fri, Dec 20 2024 1:47 AM

-

● పుత్తూరులో 27 మందిని కరచిన వైనం

పుత్తూరు: పట్టణంలో ఓ పిచ్చికుక్కు స్వైర విహారం చేస్తూ 27 మందిని కరచింది. ఇందులో ముగ్గురు పిల్లలతో పాటు 15 మంది వృద్ధులు ఉన్నారు. వీరందరికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పుత్తూరులోని ఆర్డీఎం గేట్‌ నుంచి ఎన్టీఆర్‌ కాలనీ, ఎన్జీఓ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్‌, తిరుపతి రోడ్డు, నగరం రోడ్డు, కాపువీధిలో కనబడిన ప్రతి ఒక్కరినీ పిచ్చికుక్క కరవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు దానిని కొట్టి చంపేశారు. కుక్క కాటుకు గురైన వారిలో గొల్లపల్లికి చెందిన తన్మయి(3), కృష్ణసముద్రం గ్రామానికి చెందిన రియన్‌(4), ప్రతిభ(9), ఆరేటమ్మ కాలనీకి చెందిన రోజా(17), నెత్తంకు చెందిన సంతోష్‌(17), లక్ష్మీనగర్‌కు చెందిన రవికుమార్‌(31), కావరాజ్‌నగర్‌కు చెందిన ధనరాజ్‌(21), ఎన్జీఓ కాలనీకి చెందిన బాలసుబ్రమణ్యం (42), కేశవ(19), రామచంద్రయ్య(53), ఆర్డీఎం గేట్‌కు చెందిన రామచంద్రరాజు (62), ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన మధు(60), చాందిని(52), లక్ష్మీనగర్‌కు చెందిన సురేష్‌కుమార్‌(50), వెంకటనేష్‌(18), భారతయ్య(49), ముని(51) వెంకటేష్‌ (18), కృష్ణ(49) తదితరులు ఉన్నారు. వీరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement