మావాళ్లకు ఇవ్వాలంటూ లేఖలు
మా వాళ్లకే ఉద్యోగం ఇవ్వండని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయానికి ప్రజాప్రతినిధులు, కూటమి నేతల నుంచి సిఫార్సు లేఖలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. దీనికి తోడు ఫోన్ కాల్స్ కూడా అధికం కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మెరిట్ జాబితాను తయారు చేయలేమని చేతులెత్తేసున్నారు. దీంతో మెరిట్ లిస్ట్ తయారీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం కలెక్టర్ వరకు చేరడంతో పారదర్శకంగా చేపట్టాలని హుకుం జారీ చేశారు. ఈ కబురుతో అధికారులు కాస్త కుదురుగా సీట్లలో కూర్చుకుంటున్నారు. దీని తర్వాత అధికారుల జాబితా తయారీలో ఏవిధమైనా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయో వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment