● రిటైర్డు ఆర్మీ జవాన్ ఇంటికి వచ్చిన మోసగాడు ● మాటల్లో దింపి పాలలో మత్తు మందు కలిపిచ్చిన వైనం ● ఆపై బాధితులను కట్టేసి బంగారు, సెల్‌ఫోన్ చోరీ
గుడిపాల: బస్సులో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టిన వారికే.. ఓ వ్యక్తి కన్నం పెట్టిన ఘటన గుడిపాలలో వెలుగు చూసింది. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మండంలోని పాపసముద్రం గ్రామానికి చెందిన ఆర్మీలో పని చేసి రిటైర్డు అయిన సుబ్రమణ్యంరెడ్డి అలియాస్ మణి(78) భార్యతో కలిసి నివసిస్తున్నాడు. నవంబర్‌లో చిత్తూరు నుంచి వేలూరుకు వెళ్తున్న బస్సులో వెళ్తుండగా సుబ్రమణ్యంరెడ్డికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్త సన్నిహితంగా మారడంతో ఈ నెల 17వ తేదీన ఆ వ్యక్తి సుబ్రమణ్యంరెడ్డి ఇంటికి వచ్చాడు. వారి ఇంట్లోనే రాత్రి భోజనం చేశాడు. అనంతరం ఇక్కడే పడుకోవాలని సుబ్రమణ్యంరెడ్డి అతన్ని కోరడంతో ఉండిపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో ఆ వ్యక్తి వాళ్లను మాటల్లోకి దింపి మత్తు మందు కలిపిన పాలను తాగించాడు. అనంతరం వారిని తాడుతో కట్టేసి కత్తితో బెదిరించి ఇంట్లో ఉన్న 114 గ్రాముల బంగారుతో పాటు సుబ్రమణ్యంరెడ్డి సెల్‌ఫోన్, బైక్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. అయితే బైక్‌ను గుడిపాల క్రాస్‌లో వదిలేసి వెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment