డీఎంహెచ్‌ఓగా సుధారాణి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓగా సుధారాణిని నియమిస్తూ శనివారం రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె తిరుపతి జిల్లా చంద్రగిరి అడిషనల్ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్నారు. ఇక్కడ డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న ప్రభావతిదేవిని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు అడిషనల్ డీఎంహెచ్‌ఓగా బదిలీ చేశారు. కాగా వీరు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.
నిత్యాన్నదానానికి
రూ.లక్ష విరాళం
కాణిపాకం:కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని నిత్యాన్నదానానికి శనివా రం ఓ దాత రూ. లక్ష విరాళం అందజేశారు.వైజా గ్‌కు చెందిన దాత వెంకటరమణి..నగదును ఆలయ అధికారులకు అందించగా, వారు ఆమెకు స్వామి దర్శనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం):చిత్తూరు నగరంలో ని వేలూరు రోడ్డులో శనివారం సప్తగిరి గ్రామీణ బ్యాంకును ప్రారంభించారు. ఇండియన్ బ్యాంకు ఆర్‌బీడీ జీఎం చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేశారు. బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ ఏఎస్‌ఎన్‌ప్రసాద్, జనరల్ మేనేజర్ ప్రభాకరన్, రీజినల్ మేనేజర్ డీఎస్‌వీఆర్ కిషోర్ పట్నాయక్, బ్రాంచ్ మేనేజర్ హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు స్పెల్‌బీ సెమీఫైనల్స్
తిరుపతి ఎడ్యుకేషన్ : సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో స్పెల్‌బీ సెమీఫైనల్స్ (మూడవ రౌండ్) పరీక్షను తిరుపతి జీవకోనలోని విశ్వం హైస్కూల్‌లో ఆదివారం ఉదయం 10గంటల నుంచి నాలుగు కేటగిరిలో నిర్వహించనున్నట్లు సాక్షి ఈవెంట్స్ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇదివరకు పాఠశాల, జిల్లా స్థాయిలో నిర్వహించిన స్పెల్‌బీ పోటీల్లో ప్రతిభ చూపి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన తిరుపతి, వైఎస్సార్ కడప, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవ్వాలన్నారు. ఉదయం 10గంటలకు కేటగిరి–1, 11గంటలకు కేటగిరి–2, మధ్యాహ్నం 12గంటలకు కేటగిరి–3, ఒంటి గంటకు కేటగిరి–4 విభాగాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా వారి స్కూల్ యూనిఫాం, స్కూల్ ఐడీ కార్డుతో పాటు పెన్ను, పెన్సిళ్లు, రైటింగ్ ప్యాడ్‌తో పరీక్ష సమయానికి ముందే చేరుకోవాలని ఆయన సూచించారు.
క్రిస్మస్ హైటీ రేపు
చిత్తూరు కలెక్టరేట్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన అధికారికంగా జిల్లాస్థాయి క్రిస్మస్ హైటీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు క్రిస్మస్ హైటీ కార్యక్రమం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment