రెండోసారి నారావారి ప్రారంభోత్సవాలు
వి.కోట:వి.కోట పట్టణంలోని ఉపమార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చెసిన రక్షిత మంచి నీటి ప్లాంటును ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి ఆది వారం పునఃప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు. 2016 సంవత్సరంలో నారా భువనేశ్వరి మార్కెట్ యార్డులో రక్షిత మంచినీటి ప్లాంటును ప్రారంభించి 8 ఏళ్లు గడిచింది. ఇప్పుడు మళ్లీ పాత పనికి కొత్త ప్రారంభం ఏమిటని ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్లాంటు పునఃప్రారంభానికి తెలుగు తమ్ముళ్లు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో సుజల హెరిటేజ్ రైతు సంక్షేమ నిధి, వ్యవసాయ మార్కెట్ కమిటీ సౌజన్యంతో నారా భువనేశ్వరి 2016 జనవరిలో ప్రారంభించిన భవనాన్నే మళ్లీ ఇప్పుడు కొత్త రంగులు అద్ది ప్రారంభించేందుకు తెలుగు తమ్ముళ్లు ఆర్భాటం చేస్తున్నారు.
వి.కోటలో వాటర్ ప్లాంట్,
పాత భవనానికి రంగులేసి మరోమారు
పునఃప్రారంభానికి ఏర్పాట్లు
నేడు పునః ప్రారంభించనున్న
సీఎం సతీమణి నారా భువనేశ్వరి
నవ్వుకుంటున్న జనం
Comments
Please login to add a commentAdd a comment