● చిత్తూరులో రూ.1.20 లక్షలు విలువ చేసే 8 కేజీల గంజాయి పట్టివేత ● నలుగురు అరెస్ట్
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పోలీసులు గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చిత్తూరు టూటౌన్ పోలీసులు సుమారు రూ.1.20 లక్షలు విలువ చేసే 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా.. సీఐ నెట్టికంఠయ్య తన బృందంతో ఇరువారం ప్రాంతంలో గంజాయి విక్రయాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు పట్టుబడగా వారి నుంచి రూ.1.20 లక్షలు విలువజేసే 8 కేజీల వరకు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ రైల్వేస్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వీరు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే బంగారుపాళ్యం మండలం చీకురుపల్లికి చెందిన వాసు అనే వ్యక్తితో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరు చిత్తూరులో గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన వారిలో సంతపేటకు చెందిన అమర్‌నాథ్ (37), దేవేంద్ర (48), ఎంజీఆర్ వీధికి చెందిన లోకేష్ (25), కార్తీక్ (20)పై కేసు నమోదు చేసి అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించారు. చీకుపల్లి వాసు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ ప్రసాద్, కానిస్టేబుల్ పరాందామ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment