మెనూ తప్పిన భోజనం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శనివారం ప్రారంభమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్నభోజన పథకంపై విద్యార్థులు విముఖత వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ఆహారం వడ్డించకపోవడంపై తల్లిదండ్రులు విమర్శలు గుప్పించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూటమి ఎమ్మెల్యేలు ఆర్భాటంగా మధ్యాహ్నభోజన పథకం ప్రారంభించారు. నిబంధనల ప్రకారం మొదటి రోజు అన్నం, సాంబార్, వెజిటబుల్ కర్రీ, స్వీట్ పొంగల్, రాగి జావ విద్యార్థులకు పెట్టాల్సి ఉంది. అయితే నగరి, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు రూరల్‌లో అన్నం, సాంబార్, రసంతోనే సరిపెట్టారు. ఇదిలా ఉంటే కొన్ని కళాశాలల్లో అన్నం ముద్దగా, రసం చప్పగా ఉండడంతో విద్యార్థులు తినేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. ఇంటర్ విద్యార్థులకు పెట్టే మధ్యాహ్నభోజనం ఆరంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా నిర్వహిస్తారో అని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అధికారులు నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమాల్లో కూటమి ఎమ్మెల్యేలకు రాచ మర్యాదలు చేసేందుకు ప్రాధాన్యమిచ్చి మెనూ పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలో పిల్లలకు నాణ్యమైన భోజనం వడ్డించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ పథకం
రుచి లేని ఆహారంపై విద్యార్థుల విముఖత
ఇంటర్ విద్యార్థులకు ‘భోజనం’
ఐరాల:ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. శనివారం కాణిపాకం హైస్కూల్ ప్లస్‌లో పథకానికి డీఈఓ వరలక్ష్మి శ్రీకారం చుట్టారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు రుచికరంగా మధ్యాహ్న భోజనం వడ్డించాలని ఆదేశించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎం చంద్రశేఖర్‌నాయుడుకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే దాతల సాయంతో ఏర్పాటు చేసిన పాఠశాల గ్రంథాలయం సందర్శించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజన పథకాన్ని ప్రిన్సిపల్ రెడ్డిరామరాజు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment