నిరంతర విద్యుత్‌కు ముందస్తు చర్యలు
చిత్తూరు కార్పొరేషన్ : రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని నిరంతరం విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ ఆదేశించారు. శనివారం రెడ్డిగుంట, అన్పుపలె్‌ల్ కాలనీ సబ్‌స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ సర్వీసుదారులను తీసుకురావాలని, వారికి ప్రస్తుతం అందిస్తున్న 200 విద్యుత్ యూనిట్లకు సంబంధించి సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, డీఈ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
6 నుంచి కుప్పంలో
సీఎం పర్యటన
కుప్పం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ద్రవిడ విశ్వవిద్యాలయంలో స్వర్ణ కుప్పం విజన్– 2029 ప్రారంభించనున్నారు. అనంతరం అగరం కొత్తపల్లెలో డ్వాక్రా మహిళలతో సమావేశం కానున్నారు. 3.20 గంటలకు నడుమూరులో సోలార్ సిస్టమ్‌పై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం చీగలపల్లెలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనున్నారు. సాయంత్రం 5.20 గంటలకు ద్రవిడ వర్సిటీకి చేరుకుని టీడీపీ శ్రేణులతో నిర్వహించే సమావేశంలో పాల్గొననున్నారు. రాత్రి 8 గంటలకు కుప్పం ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు టీడీపీ స్థానిక కార్యాలయానికి చేరుకుని వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కంగుందిలో శ్యామన్న విగ్రహం ఆవిష్కరించనున్నారు. అనంతరం ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ క్రమంలోనే కడపల్లె వద్ద నిర్మిస్తున్న తన నివాస పనులను పరిశీలించనున్నారు. తర్వాత ద్రవిడ వర్సిటీలో అకడమిక్‌బ్లాక్‌ను ప్రారంభించనున్నారు. రాత్రికి ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో బస చేసి, బుధవారం ఉదయం తిరుగుప్రయాణం కానున్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
చిత్తూరు కలెక్టరేట్ : నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను శనివారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ మోహన్‌కుమార్ ఆవిష్కరించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని వెల్లడించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, జిల్లా అధ్యక్షుడు మునికృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, నేతలు ఉమాపతి, రామచంద్రయ్య, రాజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment