జెల్లి ఫ్యాక్టరీ ఎదుట నిరసన
కుప్పంరూరల్: మండలంలోని ఆవులనత్తం గ్రామం వద్ద నడుపుతున్న జెల్లి ఫ్యాక్టరీ కారణంగా తమ పంట పొలాలు నాశనమవుతున్నాయని, ఇళ్లు పగుళ్లు వస్తున్నాయని, తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు జెల్లి ఫ్యాక్టరీ వద్ద సోమవారం నిరసనకు దిగారు. గ్రామస్తులు ఓ శిబిరం ఏర్పాటు చేసుకుని సోమవారం ఉదయం నుంచి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న కుప్పం సీఐ శంకరయ్య నిరసన కారులకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. సీఎం పర్యటన ఉందని, తరువాత మాట్లాతామని పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఫలితం లేక పోయింది. దీంతో చేసేది లేక పోలీసులు తిరుగుముఖం పట్టారు. నిరసనకారులు మాత్రం తమకు న్యాయం చేసే వరకు నిరసన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
Comments
Please login to add a commentAdd a comment