పరిశ్రమల ఏర్పాటు వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం
పుంగనూరు: కరువుకు చిరునామా అయిన పుంగనూరు నియోజకవర్గంలో కేవలం ఏడాది కాలంలోనే పరిశ్రమ ఏర్పాటు చేయించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమైందని మాజీ ఎంపీ రెడ్డెప్ప కొనియాడారు. సోమవారం మండల కార్యాలయంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌తో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ మండలంలోని ఆరడిగుంటలో రూ.250 కోట్లతో శ్రీకాళహస్తి ఫెర్రా అల్లాయ్ కంపెనీ ఏర్పా టు చేసేందుకు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రా మచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి కృషి ఫలితంగా ఫ్యాక్టరీ ప్రారంభమైందన్నారు. ఇందులో 1500 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. కర్ణాటక సరిహద్దులోని మారు మూల గ్రామమైన ఆరడిగుంటలో ఫ్యాక్టరీ ప్రారంభం కావడంతో ఆ ప్రాంతం పట్టణ శోభను సంతరించుకుందన్నారు. పుంగనూరును పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సుమారు 10 వేల ఎకరాలను గుర్తించిందన్నారు. ఇందులో భాగంగా జర్మన్ షెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల కంపెనీ వారు సు మారు రూ.5 వేల కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటు చే యాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోరడంతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు. భూసేకరణ పనులు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయన్నారు. ప్రభు త్వం మారడంతో ఈ పనులకు బ్రేక్ పడిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోకుండా, బస్సుల కంపెనీకి అనుమతులు మంజూరు చేసి ఏర్పాటు చేయాలన్నారు. దీని ద్వారా సుమారు 3 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించడంతో పాటు అన్ని విధాల పుంగనూరు అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకోవడం మంచిదికాదన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో ఫ్యాక్టరీ ప్రారంభం కావడం శుభపరిణామమన్నారు. ఫ్యాక్టరీలకు అనువైన ప్రాంతాలను గుర్తించి, పరిశ్రమలకు ప్రోత్సాహం అందించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి మండల ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఆరడిగుంట సర్పంచ్ శంకరప్ప, ఎంపీటీసీ సభ్యుడు నంజుండప్ప, మాజీ ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు రెడ్డెప్ప, రమణ, రామమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment