రంగు పడింది..!
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంరంలోకి రావడంతో రాష్ట్రంలో ప్రభుత్వ భవనా లు, ఆలయాలకు సైతం పసుపు రంగులు అ ద్దారు. అందుకు ఉదాహరణగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయానికి పసుపు రంగులను వేశారు. వీటితోపాటు కుప్పంలోని ప్రభు త్వ కార్యాలయం అయిన ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలో ప్రజల సౌర్యార్థం బల్లలు వేశారు. ఆ బల్లలకు సైతం చంద్రబాబు ఫొటో, మన కుప్పం మన చంద్రన్న అనే బల్లలను పసుపు రంగులో వేశారు. దీంతోపాటు కుప్పం నియోజవర్గంలో మొత్తం ఈ బల్లలే కనిపించాయి. ప్రభుత్వ కార్యాలయంలో సైతం ఇలా తెలుగుదేశం పార్టీ రంగులను వేయడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. మరోవైపు కుప్పం నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఇటీవలే నూతనంగా రోడ్లపై ప్రజాధనంతో వేసిన స్పీడు బ్రేకర్లను సైతం అధికారులు తొలగించడంపై కుప్పం ప్రజలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment