ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి
పెనుమూరు(కార్వేటినగరం): ట్రాక్టర్ బోల్తా ప డి, రైతు మృతి చెందిన సంఘటన పెనుమూరు మండలంలోని జట్టిగుండ్లపల్లెలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. జట్టిగుండ్లపల్లెకు చెందిన రఘుపతినాయుడు కుమారుడు దామోదరనాయుడు(40) తన పొలాన్ని దున్నడానికి ట్రాక్టర్‌తో వెళ్లాడు. ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దామోదరనాయుడు ట్రాక్టర్ ఇంజిన్ కింద పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమో దు చేసి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజనం మెనూలో స్వల్ప మార్పులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన ప థకం మెనూలో స్వల్ప మార్పులు చేశారని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్వల్ప మార్పు లు చేశారన్నారు. ఈ మార్పులను ప్రతి పాఠశాల హెచ్‌ఎం తప్పనిసరిగా అమలు చేయా లని ఆదేశించారు. శనివారం రోజున గతంలో గ్రీన్ లీఫీ వెజ్ రైస్ (పాలకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, సీజనల్ గ్రీన్ లీఫీ), పప్పు చారు, స్వీట్ పొంగల్, రాగిజావా అమలు చేసేవారని చెప్పారు. అయితే ప్రస్తుతం మారిన మెనూ ప్రకారం ప్రతి శనివారం అన్నం, సాంబార్, వెజిటబుల్ కర్రీ, స్వీట్ పొంగల్, రాగిజావాను విద్యార్థులకు పెట్టాలని డీఈఓ హెచ్‌ఎంలను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment