దేహదారుఢ్య పరీక్షలు
కానిస్టేబుల్ సెలక్షన్ కోసం చిత్తూరులో శనివారం మహిళలకు పకడ్బందీగా దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించారు.
పుంగనూరు పొట్టి పశువుల ఖ్యాతి ఇనుమడిస్తోంది. కేవలం మూడడుగుల ఎత్తు మాత్రమే పెరిగే వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మార్కెట్‌లో రూ.లక్షల ధర పలుకుతోంది. ప్రపంచంలోనే అరుదైన జాతిని కొనుగోలు చేసేందుకు పోటీ అధికమవుతోంది. అదృష్ట చిహ్నంగా భావించే ఈ దూడలను పెంచుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో ఔత్సాహిక రైతులు చిట్టి ‘పొట్టి’ నేస్తాలను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయిస్తున్నారు. అపురూప దూడలను విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విశిష్ట జాతిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలో పొట్టి దూడల సంరక్షణకు ఏర్పాట్లు చేశారు.
ఆదివారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2025
రూ.లక్షలు పలికే పుంగనూరు పొట్టి దూడలు
పలమనేరు : పుంగనూరు పొట్టిరకం దూడల పేరు ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పుట్టిన సమయంలో ఈ దూడ కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. జీవితకాలంలో కేవలం మూడడుగులు మాత్రమే పెరుగుతుంది. తోక నేలను తాకేలా ఉండే ఈ రకం దూడలకు ప్రస్తుతం భలే డిమాండ్ వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ రకం దూడలు రూ.2 నుంచి 4 లక్షలు పలుకుతున్నాయి. రెండో క్వాలిటీ దూడలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈ దూడలు ఇంట్లో ఇంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం వరిస్తుందనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో వీటిని కొనేందుకు వందలాదిమంది నిత్యం పశువుల సంతలు, రైతుల వద్దకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల జాబితాలో ఇప్పుడు పొట్టిదూడలు సైతం చేరిపోయాయి. వీటికి పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి. చాలా శుభ్రంగా ఉంటాయి. 15 సెం.మీ నుంచి 50 సెం.మీ మాత్రమే ఎత్తు కలిగిన ఈ దూడలు ముద్దులొలుకుతుంటాయి. పొట్టి ఆవులు 85 సెం.మీ నుంచి 110 సెం.మీ మాత్రమే ఎత్తు పెరుగుతాయి. పలమనేరు ప్రాంతంలో కొందరు రైతులు వీటిని ఫామ్స్‌లో మేపి పొట్టి జాతిని ఉత్పత్తి చేయిస్తూ వాటిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పొట్టి రకం దూడల వ్యాపారం ఊపందుకోవడం విశేషం.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
తక్కువ మేత.. అధిక పాల దిగుబడి
పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. ఇది 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. మేలైన పుంగనూరు ఎద్దుల వీర్యాన్ని పుంగనూరు రకం పొట్టి ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తోంది. వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు ఆర్‌కేవీవై కృషి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, ఇందులో 277 వరకు పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోనే ఉన్నాయి. ఈ పశువులు తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాల దిగుబడినిస్తాయి. వీటి మూత్రంలో సైతం ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఆత్మీయ నేస్తాలుగా పుంగనూరు పొట్టి దూడలు
యజమానులపై ప్రేమ.. విశ్వాసం వీటి సొంతం
రూ.లక్షల ధర పలుకుతున్న అరుదైన జాతి దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్
ఇందుకే అంత డిమాండ్
పుంగనూరు పశువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి యజమానులపై విశ్వాసం ప్రదర్శిస్తాయి. చూడముచ్చటగా ఉంటే పొట్టి దూడలు ఇంట్లో తిరుగుతుంటే చాలా మంచిదని జనం నమ్ముతారు. పొట్టి ఆవులు ఇచ్చే పాలలో రోగనిరోధకశక్తి అధికంగా ఉంటుంది. ఈ పాలను సేవిస్తే అనారోగ్యం దరిచేరదని విశ్వాసం. అలాగే కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తవని ప్రగాఢ నమ్మకం. ఇంట్లో సంచరించే వీటి తోకలు నేలను తగిలితే ఎంతో సదరు యజమానులకు ఎంతో పుణ్యమని ప్రశస్తి. దీనికితోడు పొట్టి పశువులు పరిశుభ్రత పాటించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment