● అయ్యా.. ఎస్ !
అధికార పార్టీకి చెందిన ఓ సాధారణ కార్యకర్త ముందు జిల్లాలో ప్రభుత్వ పాలన, శాంతిభద్రతలను పర్యవేక్షించే ఇద్దరు కీలక అధికారులు చేతులు కట్టుకుని నిలబడ్డ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌కు సహాయకుడిగా ఉన్న ఓ టీడీపీ కార్యకర్త చలపతి ఏర్పాట్లను వివరిస్తుంటే కలెక్టర్, ఎస్పీ చేతులు కట్టుకుని ఇలా వింటున్నారు. దీనిపై నెటిజన్లు సైటెర్లు వేస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతున్న తీరుకు ఇది నిదర్శనమని వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. – సాక్షి టాస్క్‌పోర్స్
Comments
Please login to add a commentAdd a comment