తాగు నీటికి అధిక ప్రాధాన్యం
వెదురుకుప్పం : గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సుధాకరరావు తెలిపారు. శుక్రవారం వెదురుకుప్పంలో సచివాలయ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. డీపీఓ మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా ట్యాంకులను శుభ్రంగా ఉంచుకుని ప్రజలకు సురక్షిత నీటిని అందించాలని సూచించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌లతో చర్చించి అవసరమైన నిర్ణయాలను తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పంచాయతీ కార్యాలయ నిర్వహణ, స్వర్ణ పంచాయతీ అసైన్‌మెంట్ ఎంట్రీ విధానాలకు సంబంధించి పలు సూచనలు అందించారు. ఈ క్రమంలోనే పచ్చికాపల్లం, కొమరగుంట పంచాయతీల్లోని వర్మీకంపోస్టు యార్టులు పరిశీలించారు. డీపీఓ మాట్లాడుతూ మార్చి31వ తేదీలోపు ఎస్‌డబ్ల్యూపీసీలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఎరువులు తయారు చేసి రైతులకు విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అమర్‌నాథ్, ఈఓపీఆర్‌డీ పురుషోత్తం, ఏఓ నాగరాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment