ప్రతీకాత్మక చిత్రం
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): సోషల్‌మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి వాటి వల్ల లాభాలే కాదు కొన్ని సార్లు సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. సైబర్ నేరాలు పెరుగుదలతో పాటు మహిళలకు నెట్టింట వేధింపులు బెడద పెరుగుతోంది. వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఓ వ్యక్తి ఇన్‌స్టా గ్రాంలో అశ్లీల మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నాడని 19 ఏళ్ల యువతి రామనగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అశ్లీల సందేశాల్లో ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి తన స్నేహితులకు పంపిస్తున్నాడని, ఇది నిలిపివేయాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని తెలిపింది. అతని చేష్టలతో విసిగిపోయానని, ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినట్లు యువతి పోలీసులకు తెలిపింది.
మరో ఘటనలో..
కాలేజీ ఖాతాలో రూ.8.92 లక్షలు మాయం
బనశంకరి: విజయనగర ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ క్రీడా అభివృద్ధి విభాగం బ్యాంక్ అకౌంట్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.8.92 లక్షలను ఆన్‌లైన్ ద్వారా కొట్టేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. వెంకటేశప్ప పశ్చిమ విభాగం సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్‌పీసీ లేఔట్‌లో గల బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ బ్యాంకు ఖాతా ఉంది. ఎవరికీ తెలియకుండా మే 12 నుంచి 30 మధ్య దశలవారీగా రూ.8.92 లక్షల నగదు ఇతర ఖాతాల్లోకి వెళ్లిపోయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ దొంగలు కాజేశారా, లేక కాలేజీ సిబ్బంది పాత్ర ఉందా అనేది తేలాల్సి ఉంది.
చదవండి: వాట్సప్‌లో పరిచయం ఆపై చనువు.. అప్పటి నుంచి అసలు కథ మొదలైంది!
Comments
Please login to add a commentAdd a comment