Man Harassed By Woman Over Blackmail With Indecent Videos- Sakshi
Sakshi News home page

న్యూడ్‌ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి

Published Thu, Oct 14 2021 9:47 AM | Last Updated on Thu, Oct 14 2021 11:34 AM

Man Harassed By Woman Over Blackmail With Indecent Videos - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి చాటింగ్‌లో తన నగ్న వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతోందని బాధితుడు ఒకరు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్‌ నెం.12లోని భోలానగర్‌లో నివసించే ఓ వ్యక్తి (32) ఎల్రక్టీషియన్‌గా పని చేస్తున్నారు. జూలై నెలలో సాక్షి వర్మారెడ్డి పేరుతో ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ స్నేహితులుగా మారి వాట్సాప్‌ చాటింగ్‌ చేసుకున్నారు.

ఆ తర్వాత ఆమె తన నగ్న వీడియోలు చూపించి.. బాధితుడి ని కూడా నగ్నంగా ఉన్న వీడియోలు పెట్టాలని చెప్పడంతో అలాగే చేశాడు. కాసేపటి తర్వాత ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పెడుతానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఆ వీడియోను కొంత మందికి కూడా పంపించింది. అంతటితో ఆగకుండా ఆత్మహత్య చేసుకుంటానంటూ భయభ్రాంతుల కు గురిచేస్తూ వస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement