Mumbai Police Bust Blue-Film Racket six Members Arrested - Sakshi
Sakshi News home page

పోర్న్‌ వీడియో రాకెట్‌ గుట్టు రట్టు 

Published Sat, Feb 6 2021 12:28 PM | Last Updated on Sat, Feb 6 2021 2:49 PM

Mumbai Police Busted Blue Film Making Racket - Sakshi

ముంబై : ఔత్సాహిక నటీ, నటులు, మోడల్స్‌తో పోర్న్‌ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియా, ఇతర వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తున్న  ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ముంబై, మలద్‌లోని మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో పోర్న వీడియో‌ చిత్రీకరణ జరుగుతోందని శుక్రవారం క్రైం బ్రాంచ్‌ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సదరు బంగ్లాపై పోలీసులు రైడ్‌ చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నటులు, ఓ లైట్‌ మ్యాన్‌, మహిళా ఫొటోగ్రాఫర్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌ ఇందులో ఉన్నారు. ఈ పోర్న్‌ వీడియో రాకెట్‌ నుంచి ఓ మహిళను సంరక్షించారు. నిందితులు మొబైల్‌ ఫోన్ల ద్వారా వీడియోలు‌ తీస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే 6 మొబైల్‌ ఫోన్లు,  ఒక లాప్‌ట్యాప్‌, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ( మహిళలే టార్గెట్‌: తేనె అమ్ముతున్నట్లు నటిస్తూ..)

దీనిపై ఇన్‌స్పెక్టర్‌ కేదారి పవార్‌ మాట్లాడుతూ.. ‘‘ ఔత్సాహిక నటీ,నటులు, మోడల్స్‌ ఈ  పోర్న్ వీడియో‌ రాకెట్‌ గ్రూపు టార్గెట్‌. సినిమాలు, ఓటీటీ సిరీస్‌లలో అవకాశం ఇస్తామని అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు. షరతులేవీ చెప్పకుండా వారితో అగ్రిమెంట్‌ చేయించుకుని బలవంతంగా పోర్న్‌ వీడియోలలో నటించేలా చేస్తున్నారు. ఆ వీడియోలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. పోర్న్‌ వీడియోల ద్వారా నిందితులు రెండేళ్లలో 37 లక్షల రూపాయలు సంపాదించారు’’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement