ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: అతివేగంగా దూసుకెళ్లిన వాహనాల రూపంలో చెన్నైలో ఇద్దరు పోలీసులు, చెన్నై శివార్లలో దంపతులు మంగళవారం వేకువజామున విగతజీవులయ్యారు. తిరుప్పూర్‌కు చెందిన కార్తిక్(34), రామనాథపురానికి చెందిన రవీంద్రన్(32) సాయుధబలగాల విభాగంలో పోలీసులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు ఇటీవల ట్రైనింగ్ ముగించుకుని చెన్నై నగర విభాగంలో విధులకు చేరారు. వీరు కోయంబేడు బస్‌టెరి్మనల్‌లో భద్రతా విధుల్లో ఉన్నారు. రవీంద్రన్ ఆవడిలో, కార్తిక్ అన్ననూరులో బస చేశారు. ఈ ఇద్దరు మంగళవారం వేకువజామున ఒకే మోటారు సైకిల్‌పై కోయంబేడుకు బయలుదేరారు. మార్గం మధ్యలో వెస్ట్ మొగపేర్ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రవీంద్రన్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ కార్తిక్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
బర్త్‌డే పారీ్టతో..
ఇద్దరు పోలీసుల మృతికి కారణమైన కారును నడిపింది విద్యార్థులుగా తేలింది. పొత్తేరిలోని ఓ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతున్న నొలంబూరుకు చెందిన వరుణ్ శేఖర్, కేకే నగర్‌కు చెందిన రోహిత్ సూర్య, అంబత్తూరుకు చెందిన మెకానికల్ ఇంజినీర్ అమర్‌నాథ్‌లను అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ సూర్య బర్త్‌డే వేడుకల్ని కేకేనగర్‌లో జరుపుకున్న ఈ మిత్ర బృందం ఆ ఉత్సాహంతో దూకుడుగా వాహనం నడిపి ఇద్దరు పోలీసుల్ని బలి కొనడం విచారణలో తేలింది. కారు వరుణ్‌కు చెందినది కాగా, నడిపింది అమర్‌నాథ్ అని తెలిసింది.
దంపతులు బలి..
చెంగల్పట్టు సమీపంలోని పెరుమాట్టు నల్లూరు కు చెందిన శ్రీనివాసన్(46), ఆదిలక్షి్మ(40) దంపతు లు. వీరిద్దరు మధురాంతకంలోని బంధువుల ఇంటికి సోమవారం వెళ్లారు. మంగళవారం వేకువజామున ఈ ఇద్దరు బైక్‌లో తిరుగు పయనం అయ్యారు. మామండూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఇద్దరు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. అలాగే చెన్నై మాధవరం సమీపంలోని బైక్‌లో వెళ్తున్న ఓ యువతిని లారీ ఢీకొనడంతో మృతిచెందింది. మృతురాలు కొడుంగయూరుకు చెందిన శివకుమార్ కుమార్తె హేమ వర్షిణి(25)గా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment