విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి

Published Fri, Oct 18 2024 3:04 AM | Last Updated on Fri, Oct 18 2024 3:04 AM

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయాలి

అమలాపురం టౌన్‌: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, వారిలో పోటీతత్వాన్ని పెంచాలని డీఈఓ ఎం.కమలకుమారి సూచించారు. ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ)కు జిల్లాలో ఎంపికై న పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి విద్యా వైభవ్‌ ఒలింపియాడ్‌ పోటీలు స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. జిల్లాలో పీఎంశ్రీకు ఎంపికై న 26 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా వైభవ్‌ ఒలింపియాడ్‌, మంథన్‌ మండల్‌, డిజిటల్‌ క్విస్ట్‌, డిస్కవరీ లెర్నింగ్‌ అండ్‌ లోకల్‌ సైట్స్‌ అంశాల్లో పోటీలు జరిగాయి. విద్యా వైభవ్‌ క్విజ్‌ పోటీల్లో పి.గన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బి.సింధు, ఎల్‌.అజేయుడు (ప్రథమ), మండపేట శ్రీగౌతమి మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్‌.దీక్షిత, ఎస్‌.గీతాశ్రీ (ద్వితీయ), హసన్‌బాడ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీహెచ్‌ఎన్వీ మహేశ్వరి, సీహెచ్‌ తనూశ్రీ (తృతీయ) విజేతలుగా నిలిచారు. మంథన్‌ మండల్‌ డిబేట్‌ పోటీల్లో కె.గంగవరం మండలం దంగేరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి డీఎంఎల్‌ఎస్‌ఎస్‌ విద్య, అయినవిల్లి మండలం సిరిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.సాయి అశ్రిత, రామచంద్రపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.హర్షిణి దుర్గ, డిస్కవరీ అండ్‌ లోకల్‌ సైట్స్‌ ఫొటో ఎగ్జిబిషన్‌లో రాజోలు మండలం కడలి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని వి.లక్ష్మీజ్యోతి, అమలాపురం మహాత్మాగాంఽధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎం.దత్త గోవింద్‌, మలికిపురం మండలం బట్టేలంక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సీహెచ్‌ వైష్ణవి, డిజిటల్‌ క్వెస్ట్‌ పోటీల్లో ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి జి.శేషపద్మ వైష్ణవి, ఐ.పోలవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్‌కేఎస్‌ఎస్‌ మీనన్‌, మండపేట ఎన్‌జీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని వై.ప్రణీతలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను గెలుచుకున్నారు. జిల్లా విజేతలను త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని డీఈఓ తెలిపారు. పోటీలకు అమలాపురం మహాత్మ గాంఽధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బి.కామేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. పాఠశాల హెచ్‌ఎం వి.విజయకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు కో ఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావు, సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ప్రోగ్రామ్‌ నోడల్‌ అధికారి పి.రాంబాబు, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మకాయల గణేశ్వరరావు, విత్తనాల శ్రీనివాస్‌ తదితరులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement