చదువులకు చంద్ర గ్రహణం
కూటమి హయాంలో ప్రభుత్వ విద్యకు తూట్లు
పాఠశాల విద్య కుంటుపడుతోంది
మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం కసరత్తు పేరుతో ఆలస్యం చేయడం మంచిది కాదు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినా ప్రయోజనం లేదు. ఉపాధ్యాయుల కొరత వల్ల పాఠశాలల్లో విద్య కుంటుబడుతోంది. పాఠశాలలో ఆధునిక విద్యను పునరుద్ధరించాల్సి ఉంది. ఫీజుల రీయింబర్స్‌మెంట్ చేయకపోవడం అన్యాయం.
– యిళ్ల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ
విద్యార్థుల జీవితాలతో
ప్రభుత్వం ఆటలు
ఫీజులు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఫీజుల బకాయిల పేరుతో వారిని పరీక్షలకు హాజరు కానివ్వబోమని యాజమాన్యాలు చెబుతున్నాయి. విద్యార్థులు నలిగిపోతున్నారు.
– జి.రవికుమార్, ఏఐఎస్‌ఎఫ్,
జిల్లా ప్రధాన కార్యదర్శి, అమలాపురం
సాక్షి, అమలాపురం: ‘పేదింటి పిల్లలు అంతర్జాతీయ విద్యా వేదికలపై తమ సత్తా చాటాలి. అలా చేయాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక విద్య ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థికి అందాలి’’ అన్నదే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. ఇందుకు అనుగుణంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువ మంది చదువుకునే పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో నాడు–నేడులో ఆధునీకరించారు. మౌలిక సదుపాయాలు కల్పించడం, మధ్యాహ్న భోజన మెనూను సమూలంగా మార్పులు చేసి నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో బైజూస్ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు. ఏటా డిసెంబర్ 21న తన పుట్టినరోజు సందర్భంగా జగన్ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేసేవారు. పాఠాలు చెప్పించడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అమ్మ ఒడిని ఏటా క్రమం తప్పకుండా అమలు చేయడం, వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా చెప్పుకుంటూ పోతే సీఎంగా జగన్ ఉన్న ఐదేళ్లూ ప్రభుత్వ విద్యను స్వర్ణయుగంగా మార్చారని తల్లిదండ్రులు ఆయన ముందుచూపును గుర్తు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి తల్లకిందులైంది. ప్రభుత్వ విద్యకు గ్రహణం పట్టించింది.
జగన్ హయాంలో
‘ప్రభుత్వ విద్యకు స్వర్ణయుగం’
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాం నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులకు ఒక స్వర్ణయుగం. జిల్లాలో బైజూస్ ట్యాబ్స్‌ను అందించారు. 2022–23 విద్యా సంవత్సరంలో 14,561 మంది విద్యార్థులకు, 2023–24 విద్యా సంవత్సరంలో 13,340 మంది విద్యార్థులకు ట్యాబ్స్ అందజేశారు.
● పాఠశాలల్లో డిజిటల్ విద్యలో భాగంగా 2022–23లో 191 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 264 స్మార్ట్ టీవీలు, 142 ఉన్నత పాఠశాలలకు 951 ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ను అందజేశారు. 2023–24లో 197 ఉన్నత పాఠశాలలకు 873 ఐఎఫ్‌పీ ప్యానల్స్ ఇచ్చారు.
● అమ్మఒడి పథకంలో భాగంగా తల్లి ఖాతాలో 2019–20 విద్యా సంవత్సరంలో 1,47,994 మందికి రూ.206.991 కోట్లు, 2020–21 విద్యా సంవత్సరంలో 1,44,797 మంది తల్లుల ఖాతాల్లో 217.196 కోట్లు జమ చేశారు. 2021–22 విద్యా సంవత్సరంలో 1,45,462 మంది తల్లుల ఖాతాల్లో 218.193 కోట్లు, 2022–23 సంవత్సరానికి రూ.1,38,833 మందికిగాను రూ.180.48 కోట్లు తల్లుల ఖాతాలో జమ చేశారు.
● జిల్లాలో మనబడి నాడు–నేడు పథకం ఫేజ్–1లో 436 పాఠశాలలను రూ.104.96 కోట్లతో అభివృద్ధి చేశారు. ఫేజ్–2లో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రూ.257 కోట్లు మంజూరయ్యాయి. ఎస్‌ఎంఎఫ్ (స్కూల్ మెయింటినెన్స్ ఫండ్) కేటాయించి పాఠశాలలో చిన్నచిన్న పనులకు రూ.27.76 కోట్లు విడుదల చేశారు.
● జగనన్న గోరుముద్దలో 1,05,698 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. వారానికి ఐదు రోజులు కోడిగుడ్డు, మూడు రోజుల 25 గ్రాముల బరువు ఉన్న చిక్కీ, మిగిలిన మూడు రోజులు రాగిజావ అందజేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో 2,685 మంది కుక్ కమ్ హెల్పర్లు విధులు చేపడుతున్నారు. హెల్పర్‌కు నెలకు రూ.3 వేల వంతున ప్రభుత్వం చెల్లించేలా ఏర్పాటు చేశారు.
● పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమానికి 1,689 మందిని శానిటేషన్ ఆయాలుగా నియమించారు. వీరికి ప్రతి నెలా రూ.6వేల గౌరవ వేతనం అందజేశారు. నాడు–నేడులో మరుగుదొడ్లను ఆధునీకరించారు.
● ప్రతి ఏటా క్రమం తప్పకుండా పాఠశాల ప్రారంభం రోజునే జగనన్న విద్యాకానుక అందజేశారు. జేవీకే కిట్‌లో మూడు జతల యూనిఫామ్స్, నోట్‌బుక్స్, పాఠ్య పుస్తకాలు, రెండు జతల సాక్స్‌లు, ఒక జత షూ, బెల్ట్, స్కూల్ బ్యాగ్, డిక్షనరీలు అందజేశారు.
● జిల్లాలో 2023–24లో జగన్న విదేశీ విద్య పథకానికి ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి రూ.62,64,256 మంజూరయ్యింది.
● జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా 2022 ఏప్రిల్‌లో 9,591 మంది విద్యార్థులకు రూ.8,94,45,000 విడుదల చేయగా, 2022–23 విద్యా సంవత్సరంలో రూ.7,90,97,500 ఇచ్చారు.
● జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా 2022 మేలో 10,231 మంది విద్యార్థులకు రూ.7,75,30,374, 2022 ఆగస్టులో 10,321 మంది విద్యార్థులకు రూ.6,24,00,163, 2022 డిసెంబరులో 10,498 మంది విద్యార్థులకు రూ.6,63,09,729 విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరంలో 2023 మార్చిలో 8,733 మంది విద్యార్థులకు 8,47,71,371, అదే ఏడాది మేలో 297 మంది విద్యార్థులకు రూ.35,27,944, అదే ఏడాది ఆగస్టులో 8,673 మంది విద్యార్థులకు 6,60,84,254, అదే ఏడాది డిసెంబరులో 9,568 మంది విద్యార్థులకు రూ.7,04,40,994 విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి విడతగా మార్చిలో 8,824 మంది విద్యార్థులకు రూ.6,14,77,716 విడుదల చేశారు.
కూటమి సర్కారు ఏలుబడిలో
కుంటుపడిన పాఠశాల,
కళాశాల విద్య
ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు
తల్లికి వందనం ఊసే ఎత్తని పాలకులు
పేరుకుపోయిన
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
ఆగిన వసతి దీవెన,
విద్యా దీవెన సొమ్ము మంజూరు
ట్యాబ్‌ల పంపిణీ లేదు..
బైజూస్ పాఠాలూ లేవు
వైఎస్సార్ సీపీ హయాంలో
ఐదేళ్లూ ప్రభుత్వ విద్యకు స్వర్ణయుగం
మాజీ సీఎం జగన్ ముందుచూపును
గుర్తు చేసుకుంటున్న తల్లిదండ్రులు
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పాఠశాల విద్యార్థులకు ఇస్తామన్న ట్యాబ్‌ల ఊసేలేదు. బైజూస్ పాఠాలు నిలిచిపోయాయి. అమ్మ ఒడికి తల్లికి వందనం అని పేరు మార్చారు కాని ఇంతవరకు తల్లుల ఖాతాలో సొమ్ము వేయలేదు. కూటమి నేతలు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాలో సుమారు 2.08 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాల్సి ఉంది.
పాఠశాలల్లో నాడు– నేడు రెండవ దశ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. రెండవ దశలో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 57 పాఠశాలల్లో మాత్రమే పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు దాదాపుగా నిలిచిపోయాయి.
1,573 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కుక్, హెల్పరుగా పని చేస్తున్నవారికి కుకింగ్ చార్జీలు అందించాల్సి ఉంది. పాఠశాలలో 1,660 మంది పారిశుధ్య కార్మికులకు రూ.4.98 కోట్లు, 212 మంది నైట్ వాచ్‌మన్‌లకు గౌరవ వేతనం బకాయి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment