23న మినీ జాబ్‌మేళా
పి.గన్నవరం: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పి.గన్నవరం లక్ష్మీ ఐటీఐ కళాశాలలో ఈ నెల 23వ తేదీ ఉదయం మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ జిల్లా అధికారి డి.హరిశేషు తెలిపారు. మూడు కంపెనీల్లో 62 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. పదో తరగతి నుంచి పీజీ వరకూ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వివరాల కోసం సెల్ 82476 45389 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరిశేషు విజ్ఞప్తి చేశారు.
26 నుంచి సీపీఐ
శత వార్షికోత్సవాలు
అమలాపురం టౌన్: సీపీఐ 100వ ఆవిర్భవ శత వార్షికోత్సవాలను ఈనెల 26వ తేదీ నుంచి ఘనంగా నిర్వహించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.ప్రభాకర్ పిలుపునిచ్చారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో సీపీఐ పార్టీ ఆవిర్భవించిందని వివరించారు. పార్టీ జాతీయ కార్యవర్గం వందేళ్ల పండుగను 2025 సంవత్సరమంతా జరుపుకావాలని పిలుపునిచ్చిందని చెప్పారు. మన రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి 2025 జనవరి 1వ తేదీ వరకూ శత వార్షికోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్ భవనంలో పార్టీ నాయకుడు కె.రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా సమితి సమావేశంలో ప్రభాకర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సీనియర్ నేత దేవా రాజేంద్ర ప్రసాద్ పార్టీ వందేళ్ల చరిత్ర వివరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు మాట్లాడుతూ ఈ నెల 27న ముమ్మిడివరం నియోజకవర్గంలో పార్టీ శత వార్షికోత్సవాల ప్రారంభ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు సీపీఐ శత వార్షికోత్సవం –కమ్యూనిజంపై ముద్రించిన సంచికను విడుదల చేశారు. పార్టీ నాయకులు నిమ్మకాయల శ్రీనివాసరావు, గెడ్డం ప్రభాకర్, రాము, నల్లి బుజ్జి, శీలం వెంకటేష్, వనచర్ల విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
సమర్థంగా సహిత విద్య
ఆర్‌జేడీ నాగమణి
ముమ్మిడివరం: విభిన్న ప్రతిభావంతులకు భవిత కేంద్రాల ద్వారా అందించే సహిత విద్యను సమర్థంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ జి.నాగమణి పిలుపునిచ్చారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల సెమినార్ హాల్‌లో డీఈఓ షేక్ సలీంబాషా అధ్యక్షతన శుక్రవారం మండల విద్యాశాఽఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అఽతిథిగా మాట్లాడారు. సహిత విద్యను అమలు చేసేందుకు ఉన్నత పాఠశాలల్లో నియమించిన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు జాబ్‌చార్ట్ ప్రకారం విధులు నిర్వహించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. డీఈఓ డాక్టర్ సలీంబాషా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 22 భవిత కేంద్రాల ద్వారా ఐఈఆర్‌పీలు, దివ్యాంగ చిన్నారులకు అందుతున్న సేవలు సక్రమంగా అందేలా ఎంఈఓలు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. సహిత విద్య స్టేట్ కన్సల్టెంట్ వై.నరసింహ సహిత విద్యకార్యక్రమాల అమలు తీరును వివరించారు. జిల్లా కోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడారు.
పది పరీక్షలకు
విద్యార్ధులను సన్నద్ధం చేయాలి
Ð]l^óla çÜ…Ð]l-™èlÞÆý‡… Ð]l*Ça 17¯]l$…_ {´ëÆý‡…-¿ýæ-Ð]l$Äôæ$Š糨 ç³È-„ýS-ÌSMýS$ ѧéÅ-Æý‡$®ÌS¯]l$ Cç³µsìæ ¯]l$…^ól çܯ]l²§ýlª… ^ólĶæ*ÌS° BÆŠ‡-gôæyîl h.¯éVýS-Ð]l$×ìæ í³Ë$ç³# °^éaÆý‡$. hÌêÏÌZ° E¯]l²™èl ´ëuý‡-Ô>-ÌSÌS {糫§é-¯ø-´ë«§éÅ-Ķæ¬Ë$, G…D-KÌS™ø çÜÐ]l*ÐólÔèæ… °Æý‡Ó-íßæ…-^éÆý‡$. 糧ýlÐ]l ™èlÆý‡VýS† çœÍ™éÌZÏ ¯]l*Æý‡$-Ô>™èl… E¡¢Æý‡~™èl Ý뫨…-^èl-yé-°MìS AÐ]l-çÜ-Æý‡-OÐðl$¯]l ^èlÆý‡ÅË$ ¡çÜ$-Mø-Ðé-ÌS¯é²Æý‡$. Eç³-Ñ-§éÅ-Ô>Rê-«¨M>Ç h.çÜ*-Æý‡Å{ç³-M>-Ôèæ-Æ>Ð]l#, çÜÐ]l${VýS Õ„> òÜMøt-Æý‡ÌŒæ A«¨-M>-Æý‡$Ë$ ½ÒÒ çÜ${ºÐ]l$-×æÅ…, yìl.Æý‡-Ðól$‹-Ù»êº$, yé.G…MóS ½Ð]l*-Æ>Ð]l#, G…ÒÒ çÜ™èlÅ-¯éÆ>-Ķæ$×æ, HG‹ÜK MöÐ]l¬ÃÌS ¯éÆ>-Ķæ$×æ-Æ>Ð]l# ´ëÌŸY¯é²Æý‡$. ˘
రేపు నిరుద్యోగులకు సదస్సు
రామచంద్రపురం: జీవితంలో స్వయం ఉపాధి ద్వారా స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఆదివారం స్థానిక వీఎస్‌ఎం కళాశాలలో అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు నిపుణులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment