పంటపై 60 శాతం రుణం
అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా సాగులో ఉన్న వివిధ పంటల రాబడిపై 60 శాతం రుణాలు పొందే విధంగా రుణ పరిమితులను నిర్ధారించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ 2025– 26 సమావేశాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యాన పశు సంవర్ధకం, మత్స్య, శాఖలకు సంబంధించిన రుణ పరిమితులను జిల్లా స్థాయిలో సాంకేతిక కమిటీ ప్రతిపాదించిందన్నారు. ఉత్పాదక వ్యయంలో కనీసం 60 శాతం పంట రుణాలుగా అందించేందుకు ఆయా అంశాల క్రింద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిమితులను కమిటీ నిర్ణయించిందన్నారు. ప్రధానంగా వరి పంటకు సంబంధించి ఎకరాకు ఖరీఫ్‌లో రూ.49,820, రబీలో రూ.56,262 రుణ పరిమితులుగా నిర్ణయించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా లబ్ధిదారులకు పాడి గేదే ఒక్కింటికి రూ.1.20 లక్షలు పాడి ఆవులకు రూ.లక్ష వర్కింగ్ క్యాపిటల్‌గా నిర్ణయించారు. మొక్కజొన్న రబీలో సాగుకు ఎకరాకు రూ.35, 850, పప్పు దినుసులు సాగుకు ఎకరాకు రూ.22,700 గా రుణ పరిమితిని ప్రతిపాదించామన్నారు. డీసీసీబీ కార్యనిర్వాహక అధికారి ఆర్‌వీ నరసింహరావు, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట్రావు, జిల్లా మత్స్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్, స్వామి నాయుడు, లీడ్ బ్యాంకు మేనేజర్ కేశవ వర్మ, ఎస్ బీఐ డిప్యూటి రీజనల్ అధికారులు పాల్గొన్నారు.
పనితీరు మెరుగుకు చర్యలు
వ్యవసాయ పశుసంవర్ధక శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ పశుసంవర్ధక శాఖ వైద్యులు ల్యాబ్ టెక్నీషియన్లతో సమావేశం నిర్వహించి ఏడు నియోజకవర్గాలలో ఉన్న డయాగ్నోసిస్ ల్యాబొరేటరీల పనితీరు పై ఆరా తీశారు. వాటికి అవసరమైన మరమ్మతు పనులకు అంచనాలు రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ఎస్‌ఈని ఆదేశించారు. జేసీ టి.నిషాంతి, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment