చూసిన కనులదే భాగ్యం | - | Sakshi
Sakshi News home page

చూసిన కనులదే భాగ్యం

Published Tue, Jan 14 2025 8:48 AM | Last Updated on Tue, Jan 14 2025 8:48 AM

చూసిన

చూసిన కనులదే భాగ్యం

నయన మనోహరం..

మామిడికుదురు: సంక్రాంతి ‘కళ’ ఉట్టిపడింది.. అహో అద్భుతహః అనేలా కట్టిపడేసింది. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిచేలా అప్పనపల్లి శ్రీబాల బాలాజీస్వామి క్షేత్రంలో సోమవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కూచిపూడి నృత్యం, కొమ్మ దాసరి, బుడ బుక్కల, సోదెమ్మ, గంగిరెద్దుల విన్యాసాలు, విచిత్ర వేషధారణలు, కేరళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఈ సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో భోగి మంట వేసి సందడి చేశారు. 500 మీటర్ల భోగి పిడకల దండ ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొన్నారు. అనంతరం స్వామివారి సన్నిధిలో వివిధ పుష్పాలతో రూపొందించిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

వెండి గరగ సమర్పణ

పి.గన్నవరం: స్థానిక బోడపాటివారిపాలెంలోని కొండాలమ్మ ఆలయంలో అమ్మవారికి అదే గ్రామానికి చెందిన ఆర్‌కే కనస్ట్రక్షన్‌ అధినేత రంకిరెడ్డి కొండలరావు (కొండబాబు), రిషిత దంపతులు సోమవారం రూ.2.8 లక్షల విలువైన వెండి గరగను సమర్పించారు. వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రాజమహేంద్రవరం సిటీ: స్థానిక గోదావరి రైల్వే స్టేషన్‌ సమీపంలో అన్నపూర్ణమ్మ పేట రైల్వే గేటు వద్ద రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి (50) మృతి చెందాడని జీఆర్పీ ఎస్‌ఐ మావుళ్లు సోమవారం తెలిపారు. మృతుని పేరు కేకే రాజు అని, భార్య చనిపోవడంతో తానూ చనిపోతున్నట్లు, తన మరణానికి ఎవరూ కారణం కాదని తెలిపి మరణించాడన్నారు. అతని మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ సీఐ 94406 27551, ఎస్సై 94914 44022 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఆత్రేయపురం: కల్యాణం వైభోగం అన్నట్లు గోదాదేవి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.. చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగాయి.. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం గోదాదేవి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, కల్యాణం, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు భోగిమంట వేశారు. అనంతరం భక్తజన సందోహం నడుమ స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. వాడపల్లి క్షేత్రంలోని విశాలమైన స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. స్వామివారికి డీసీ అండ్‌ ఈఓ చక్రధరరావు తదితర ప్రముఖులు కల్యాణ పట్టువస్త్రాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, కల్యాణాన్ని తిలకించి, మొక్కుబడులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సతీసమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.

అప్పనపల్లిలో..

మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి క్షేత్రంలో కొలువు దీరిన శ్రీగోదా రంగనాథుల తిరు కల్యాణ మహోత్సవం సోమవారం రమణీయంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర పరిమళ సుగంధ ద్రవ్యాల నడుమ అర్చక స్వాములు గోదా రంగనాథుల కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. 200 మందికి పైగా భక్త దంపతులు కల్యాణంలో కర్తలుగా పాల్గొన్నారు. పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా రూపొందించిన మంటపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. స్వామి, అమ్మవార్ల గుణగణాలను వివరిస్తూ అర్చక స్వాములు రాయభార ఉత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు దంపతులు కర్తలుగా పాల్గొని కల్యాణ క్రతువును జరిపించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తన్మయత్వం చెందారు.

కన్నుల పండువగా గోదాదేవి కల్యాణం

భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
చూసిన కనులదే భాగ్యం 1
1/8

చూసిన కనులదే భాగ్యం

చూసిన కనులదే భాగ్యం 2
2/8

చూసిన కనులదే భాగ్యం

చూసిన కనులదే భాగ్యం 3
3/8

చూసిన కనులదే భాగ్యం

చూసిన కనులదే భాగ్యం 4
4/8

చూసిన కనులదే భాగ్యం

చూసిన కనులదే భాగ్యం 5
5/8

చూసిన కనులదే భాగ్యం

చూసిన కనులదే భాగ్యం 6
6/8

చూసిన కనులదే భాగ్యం

చూసిన కనులదే భాగ్యం 7
7/8

చూసిన కనులదే భాగ్యం

చూసిన కనులదే భాగ్యం 8
8/8

చూసిన కనులదే భాగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement