కాట్రేనికోన: ప్రతి విద్యార్థి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే విజయం సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా అన్నారు. చెయ్యేరు శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మెరిట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విద్యా ప్రేరణ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. గతం సమ్మేటివ్ పరీక్షల్లో 520కి పైగా మార్కులు సాధించిన 320 మంది విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కావాల్సిన మెళకువలు తెలిపేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ వివరించారు. దీనిని విజయవంతం చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బి.హనుమంతరావు, జిల్లా సైన్స్ అధికారి గిరజాల వెంకట సత్యసుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఎఫ్‌ఏఓ ప్రవీణ్ కుమార్, సబ్జెక్ట్ విషయ నిపుణులు, మండల విద్యాశాఖ అధికారులను డీఈఓ అభినందించారు. ఉప విద్యాశాఖాధికారులు జి.సూర్యప్రకాశం, పి.రామలక్ష్మణమూర్తి, సమగ్ర శిక్షా సీఎంఓ బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏఎంఓ పి.రాంబాబు, జిల్లా సైన్స్ అధికారి గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment