ప్రజలను నట్టేట ముంచిన ప్రభుత్వం
ప్రభుత్వ మాజీ విప్ చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి సూర్యారావు
రావులపాలెం: ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను నట్టేట ముంచారని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశారన్నారు. కేవలం అధికారం కోసం కూటమిగా జతకట్టి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే విజనరీ అని చెప్పుకునే బాబు, దావోస్‌లో అందరి కంటే ముందు సమావేశాలకు వెళ్లినా, ఎటువంటి పెట్టుబడులు సాధించలేకపోయారన్నారు.
ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ
వైఎస్సార్ సీపీ ఫీజు పోరు పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆవిష్కరించారు. విద్యార్థులకు బాసటా ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న జిల్లా కలెక్టర్లకు పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇస్తామన్నారు. అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీ గంగాధరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు వెంకటలక్ష్మి, వీరభద్రరావు, తమ్మన శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment