విద్యార్థులతో ట్రంకు పెట్టెల మోత!
రాజోలు: వసతి గృహ విద్యార్థులతో ట్రంకు పెట్టెల లోడు దింపిచిన సంఘటన స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం–1లో జరిగింది. ఈ నెల ఐదో తేదీన రాజోలు సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాలకు సుమారు 200 ట్రంకు పెట్టెలు ఆటోలో వచ్చాయి. వాటిని విద్యార్థులతో మోయిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. విద్యార్థులతో ఈ పనులు చేయించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆ క్లిప్పింగులు చూసినవారు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై వసతి గృహ వార్డెన్ రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా రాజోలు సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న అన్ని వసతి గృహాలకు సంబంధించిన ట్రంకు పెట్టెలు ఆటోలో తీసుకుని వచ్చారని, వాటిని కార్యాలయంలో ఉంచేందుకు స్థలా భావంతో వసతిగృహం వద్దకు తీసుకుని వచ్చారన్నా రు. విద్యార్థులు తమ కోసమే ఆ పెట్టెలు వచ్చాయని భావించి తమ గదుల్లోకి తీసుకుని వెళ్లేందుకు వచ్చారన్నారు. విద్యార్థులతో పెట్టెలు మోయించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment