అంతర్రాష్ట్ర కాపర్‌ వైర్‌ దొంగల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర కాపర్‌ వైర్‌ దొంగల పట్టివేత

Published Mon, Jul 8 2024 11:26 AM | Last Updated on Mon, Jul 8 2024 11:26 AM

అంతర్రాష్ట్ర కాపర్‌ వైర్‌ దొంగల పట్టివేత

మండపేట: తెలంగాణా, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కాపర్‌ వైర్లు చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగలను మండపేట పట్టణ ఎస్‌ఐ హరికోటి శాస్త్రి పట్టుకున్నారు. రాయవరం మండలం సావరం గ్రామానికి చెందిన కట్టా శివశంకర్‌, కాకినాడ రూరల్‌ చీడిగ గ్రామానికి చెందిన కట్టా సత్తిబాబు హైదరాబాద్‌, అనంతపురం, విశాఖపట్నం, పెదపూడి, ఇంద్రపాలెం, కరప, తూరంగి, రామచంద్రపురం, కాకినాడ, సర్పవరం, రాయవరం, బిక్కవోలు, అనపర్తి, మండపేట ప్రాంతాల్లో నేరాలు చేసి శిక్షలు అనుభవించిన ఈ ఇద్దరు దొంగలు ఏడాది మార్చిలో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇద్దరు తిరిగి యథావిధిగా దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఈ నేరాలు చేయడానికి కాకినాడ ఆటో షోరూంలో ఆటో కొనుగోలు చేసి ఆటోపై మండపేట వచ్చి రెండు ప్రాంతాల్లో దొంగతనాలు చేశారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద 220 కిలోల కాపర్‌ వైర్లను ఎస్‌ఐ హరికోటి శాస్త్రి, అడిషనల్‌ ఎస్‌ఐ ఎల్‌.నాంచారయ్య స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నిందితులను ఆలమూరు మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా మేజిస్ట్రేట్‌ ఐ.ప్రవీణ్‌కుమార్‌ నిందితులకు 15 రోజులు రిమాండు విధించినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసులో నిందితులను చాకచక్యంతో అరెస్టు చేసిన ఎస్‌ఐ శాస్త్రిని, అడిషనల్‌ ఎస్‌ఐ నాంచారయ్య, ఏఎస్‌ఐ చిన్నారావు, కానిస్టేబుళ్లు ఎన్‌.సతీష్‌, జి.రమేష్‌లను జిల్లా ఎస్సీ శ్రీధర్‌ అభినందించారు.

ఎస్‌ఐకు అభినందనలు

పట్టణంలో గత మూడు నెలలుగా శాంతి భద్రతలను అదుపు చేయడంలో పట్టణ ఎస్‌ఐ హరికోటి శాస్త్రి చేస్తున్న కృషిని పట్టణ ప్రజలు ప్రశంసించారు. రాత్రి పూట గస్తీ నిర్వహించడం నేరాలు అరికట్టడంతో పాటు ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాస్రి నిరోధించారని పలువురు పేర్కొన్నారు.

ఎస్‌ఐ శాస్త్రికి పలువురి ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement