భక్తజన సంద్రమైన రత్నగిరి
● నేడు కార్తిక పౌర్ణమి సందర్భంగా ముందు రోజే ఆలయానికి రాక
● ఏర్పాట్లు చేసిన అధికారులు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సన్నిధి గురువారం భక్తజనసంద్రమైంది. శుక్రవారం కార్తిక పౌర్ణిమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రానికే సుమారు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. హైదరాబాద్ , విజయవాడ నుంచి వచ్చిన భక్తులు దేవస్థానం బస్సులు, ఆటోల్లో రత్నగిరికి చేరుకున్నారు. శుక్రవారం నాటికి సుమారు లక్ష మంది రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని తెల్లవారుజామున ఒంటి గంటకు తెరవనున్నారు. ఆలయప్రాంగణంలో తొక్కిసలాట జరగకుండా పశ్చిమ రాజగోపురం వద్ద కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేసి క్రమ పద్ధతిలో భక్తులను దర్శనానికి పంపనున్నారు.
స్వామివారిని దర్శించిన 40 వేల మంది
గురువారం సుమారు 40 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించి పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 3,500 జరిగాయి. సుమారు ఐదు వేల మందికి పులిహోర, దద్దోజనం పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్టు చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ రామచంద్రమోహన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment